Malai Kebab : ఓవెన్ లేకున్నా స‌రే రెస్టారెంట్ల‌లో ల‌భించే రుచితో మ‌లై క‌బాబ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Malai Kebab : చికెన్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చికెన్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో మ‌లై క‌బాబ్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. మ‌లై క‌బాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. చాలా మంది క‌బాబ్స్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. ఒవెన్ లేకున్నా కూడా చాలా సుల‌భంగా ఈ మ‌లై క‌బాబ్స్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోచ్చు. ఒవెన్ లేకుండా రుచిగా మ‌లై క‌బాబ్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌లై క‌బాబ్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసిన బోన్ లెస్ చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, కొత్తిమీర త‌రుగు – రెండు టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, గ‌రం మ‌సాలా – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు లేకుండా చేసుకున్న పెరుగు – పావు క‌ప్పు, ప్రెష్ క్రీమ్ – పావు క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్.

Malai Kebab recipe in telugu make in this method
Malai Kebab

మ‌లై క‌బాబ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత నూనె వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ చికెన్ ను మూత ఉండే డ‌బ్బాలో ఉంచి ఫ్రిజ్ లో ఉంచాలి. దీనిని రాత్రంతా అలాగే ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. రాత్రంతా మ్యారినేట్ చేసుకునే స‌మ‌యం లేని వారు క‌నీసం 5 గంట‌ల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత చికెన్ ముక్క‌ల‌ను చ‌క్క‌గా స‌ర్ది వేయించుకోవాలి. వీటిపై మూత పెట్టి చిన్న మంట‌పై వేయించుకోవాలి. ప‌ది నిమిషాల‌కొక‌సారి ముక్క‌ల‌ను అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. ఇలా అర గంట పాటు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ముక్క‌ల‌ను చ‌ల్లార్చుకోవాలి.

త‌రువాత 5 నిమిషాల పాటు నీళ్ల‌ల్లో నాన‌బెట్టిన చాప్ స్టిక్స్ ను తీసుకుని వాటికి వేయించిన చికెన్ ముక్క‌ల‌ను గుచ్చాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద నేరుగా పెద్ద మంట‌పై వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. చికెన్ ముక్క‌ల‌ను అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌లై క‌బాబ్ త‌యార‌వుతుంది. దీనిని గ్రీన్ చ‌ట్నీ, మ‌యోనీస్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా మ‌లై క‌బాబ్ ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. ఈ క‌బాబ్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts