Methi Fish Curry : చేపలు మెంతికూర పులుసు.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.. తయారీ ఇలా..

Methi Fish Curry : చేపలు అంటే సహజంగానే నాన్‌వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. చేపలను రకరకాలుగా వండుకుని తింటుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా చేస్తుంటారు. అయితే చేపలను మెంతి కూరతోనూ కలిపి వండవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు మెంతికూర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..

చేప ముక్కలు – 4, తాజా మెంతి ఆకులు – నాలుగు కప్పులు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, మెంతులు – ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టీస్పూన్‌, పెద్ద టమాటా – ఒకటి (సన్నగా తరగాలి), కారం – రెండు టీస్పూన్లు, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి – అర టీస్పూన్‌, పసుపు – పావు టీస్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత, నిమ్మరసం – అర టీస్పూన్‌.

Methi Fish Curry know how to cook this delicious one
Methi Fish Curry

చేపలు మెంతికూర పులుసును తయారు చేసే విధానం..

చేప ముక్కలకు ఉప్పు రాసి రుద్ది పక్కన పెట్టి ఓ ఐదు నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి చేసి మెంతులు వేసి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు నూనె నుంచి గింజలను బయటకు తీయాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలిపి తరువాత సన్నగా తరిగిన టమాటాలు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిశ్రమం సాస్‌ లాగా మారే వరకు ఉడికించాలి. తరువాత మెంతి ఆకులను వేసి కలపాలి. చేప ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీరు (కావాలనుకుంటే) వేసి నెమ్మదిగా మంట మీద ఉడికించాలి. వడ్డించే ముందు కొంచెం నిమ్మరసం పిండాలి. దీంతో రుచికరమైన చేపలు మెంతికూర పులుసు రెడీ అవుతుంది. ఇది అన్నంతో చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేపలతో రొటీన్‌ వంటలను చేసేందుకు బదులుగా ఇలా వెరైటీ వంటకాన్ని ట్రై చేయండి.. బాగుంటుంది.

Editor

Recent Posts