Mirchi Bajji Onion Masala Curry : మిర్చీ బ‌జ్జీల‌ను ఇలా కూర‌గా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mirchi Bajji Onion Masala Curry : మ‌నం స్నాక్స్ గా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో మిర్చీ బ‌జ్జీ కూడా ఒక‌టి. మిర్చీ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ బజ్జీల‌ను స్నాక్స్ గా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌జ్జీల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీ ఉల్లి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మిర్చి బ‌జ్జీ ఉల్లి మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ‌జ్జీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, మిర్చీ బ‌జ్జీ – 12, వంట‌సోడా – పావు టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Mirchi Bajji Onion Masala Curry recipe in telugu very tasty
Mirchi Bajji Onion Masala Curry

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, సోంపు గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్.

కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వేడి పాలు – 2 క‌ప్పులు.

మిర్చీ బ‌జ్జీ ఉల్లి మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, ఉప్పు, ఆమ్ చూర్ పొడి, జీల‌క‌ర్ర‌, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిర్చీల‌ను తీసుకుని వాటిని నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత ఈ శ‌న‌గ‌పిండి మిశ్ర‌మాన్ని బ‌జ్జీల‌లో స్ట‌ప్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక క‌ప్పు శ‌న‌గ‌పిండి, ఉప్పు, వంట‌సోడా, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిర్చీల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత బ‌జ్జీ ముక్క‌ల‌ను వేసి నెమ్మ‌దిగా క‌లుపుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత పాలు పోసి కల‌పాలి. త‌రువాత వీటిని మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి బ‌జ్జీ ఉల్లి మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను ఒక్క‌సారి తిన్నారంటే మళ్లీ మ‌ళ్లీ కావాల‌ని అడ‌గ‌క మాన‌రు.

D

Recent Posts