Mixed Veg Dosa : దోశ‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mixed Veg Dosa : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోశ‌ను ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణ దోశ‌ల‌తో వివిధ రుచుల్లో కూడా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో మిక్స్డ్ వెజ్ దోశ కూడా ఒకటి. ఈ వెజ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ మిక్స్డ్ వెజ్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్స్డ్ వెజ్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ పిండి – త‌గినంత‌, క్యారెట్ తురుము – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన బీన్స్ – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ట‌మాట సాస్ – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కారం – కొద్దిగా, నూనె – త‌గినంత‌.

Mixed Veg Dosa recipe in telugu very tasty easy to make
Mixed Veg Dosa

మిక్స్డ్ వెజ దోశ త‌యారీ విధానం..

ముందుగా ట‌మాట సాస్ లో ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత దానిపై ముందుగా త‌యారు చేసుకున్న ట‌మాట కిచ‌ప్ ను వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత వీటిపై క్యారెట్ తురుము, బీన్స్, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసుకోవాలి. త‌రువాత దీనిపై కొద్దిగా నూనె వేసుకుని దీనిపై మూత పెట్టి దోశ‌ను కాల్చుకోవాలి. దోశ చ‌క్క‌గా కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజ్ దోశ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన దోశ‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts