Bread Pakodi : పకోడీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే భిన్న రకాల పకోడీలను తయారుచేసుకుని తింటుంటారు. ఉల్లిపాయ పకోడీ, పాలక్ పకోడీ, పనీర్ పకోడీ.. ఇలా రక రకాల పకోడీలను చేసుకుని తినవచ్చు. అయితే బ్రెడ్ పకోడీని తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలో.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉడకబెట్టి నలిపిన ఆలుగడ్డలు – 3/4 కప్పు, జీలకర్ర – 1 టీస్పూన్, తరిగిన అల్లం – 2 టీస్పూన్లు, తరిగిన పచ్చి మిర్చి – 1, తరిగిన కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్, కారం – 2 టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, బ్రెడ్ ముక్కలు – 4, శనగపిండి – 1 కప్పు, వాము గింజలు – 1 టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, నీళ్లు – 3/4 కప్పు, నూనె – తగినంత.
బ్రెడ్ పకోడీ తయారు చేసే విధానం..
ఆలుగడ్డలు, జీలకరర, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, శనగపిండి, వాము, పసుపు, నీళ్లు వేసి బాగా కలిపి పిండిని తయారు చేసుకోవాలి. అనంతరం ఆ పిండిలో బ్రెడ్ ముక్కలను బాగా ముంచి తీయాలి. అలా ముంచిన ముక్కలను నూనెలో వేయించాలి. దీంతో బ్రెడ్ పకోడీ రెడీ. వీటిని సాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.