Mutton Curry In Pressure Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో మ‌ట‌న్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Mutton Curry In Pressure Cooker : నాన్ వెజ్ ప్రియుల‌కు మ‌ట‌న్ క‌ర్రీ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ట‌న్ క‌ర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే మ‌ట‌న్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న వారు ఇప్పుడు చెప్పే విధంగా కుక్క‌ర్ లో చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ మ‌ట‌న్ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. వంట రాని వారు కూడా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌ట‌న్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, సాజీరా – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, మ‌ట‌న్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 క‌ప్పులు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Curry In Pressure Cooker make in this way
Mutton Curry In Pressure Cooker

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినంత ఉప్పు వేసి మ‌రో 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. మ‌ట‌న్ ముదురుది అయితే మ‌రో 2 నుండి 3 విజిల్స్ వ‌చ్చే వ‌రకు ఉడికించాలి. త‌రువాత మూత తీసి గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మ‌ట‌న్ ను మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, బ‌గారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts