Mustard Oil : చ‌లికాలంలో ఆవ‌నూనె వాడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Mustard Oil : మ‌నం వంటింట్లో ఉండే తాళింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఆవాల‌ను వేస్తూ ఉంటాము. ఎంతో కాలంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. ఆవాలు కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. కేవ‌లం ఆవాలే కాకుండా ఆవాల నుండి నూనెను తీసి కూడా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాము. ఆవాల వ‌లె ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పూర్వ‌కాలంలో ఆవాల నూనెను వంట‌ల్లో ఎక్కువ‌గా వాడే వారు. అలాగే ఇంటి వైద్యంలో కూడా ఈ ఆవాల నూనెను వాడే వారు. కానీ క్ర‌మంగా ఆవాల నూనెను వాడ‌డం త‌గ్గిపోయింది. కానీ ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. వంట‌ల్లో ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఆవాల నూనెలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా త‌లెత్తే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

Mustard Oil amazing health benefits in winter
Mustard Oil

మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. చ‌ర్మానికి, జుట్టుకు కూడా ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఈ విధంగా ఆవాల నూనె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని క‌నుక ప్ర‌తి ఒక్క‌రు దీనిని కూడా ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts