వినోదం

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా చేసింది ఎవ‌రో తెలుసా..?

Hello Brother Movie : సాధార‌ణంగా హీరోల‌కి డూపులు పెట్ట‌డం కొత్తేమీ కాదు. ఫైటింగ్ సీన్స్ విష‌యంలోనో లేదంటే డ‌బుల్ క్యారెక్ట‌ర్స్ ప్లే చేయాల్సిన స‌మ‌యంలోనో డూప్‌ల‌ని తీసుకుంటారు. అయితే నాగార్జున‌కు హలో బ్ర‌దర్ సినిమాలో డూప్ గా హీరో శ్రీకాంత్‌ని తీసుకున్నార‌ట‌. ఈ విష‌యం చాలా మందికి తెలియదు. కెరీర్ కోసం ట్రై చేస్తున్న స‌మ‌యంలో శ్రీకాంత్‌కి డూప్‌గా అవ‌కాశం ద‌క్క‌డం, ఈ సినిమా త‌ర్వాత పాపులారిటీ ద‌క్కించుకోవ‌డం, అనంత‌రం స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్ ఎదిగారు. ఈ విష‌యాన్ని శ్రీకాంత్ అప్పుడప్పుడూ ఇంట‌ర్వ్యూల‌లో కూడా చెబుతు ఉంటారు. ఒక‌ప్పుడు శ్రీకాంత్ ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇటీవలే సెకంగ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన శ్రీకాంత్ అఖండ సినిమాతో విల‌న్ గా కెరీర్ ను మొద‌లు పెట్టారు. ఈ సినిమాలో బాలయ్య‌ను ఢీ కొట్టే పాత్ర‌లో న‌టించి శ్రీకాంత్ ఆక‌ట్టుకున్నారు. నాగార్జున- శ్రీకాంత్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నిన్నే ప్రేమిస్తా, షిరిడి సాయి. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రమే ఈ హలో బ్రదర్ అని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.

nagarjuna dupe in Hello Brother Movie

ఇక హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే.. నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇ.వి.వి.సత్య నారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున.. దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు. సుర్రు సుమ్మైపోద్ది అనే మాస్ డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంటుంది.

Admin

Recent Posts