Nalla Karam Podi : న‌ల్ల కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Nalla Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడులు త‌యారు చేస్తూ ఉంటాం. కారం పొడులు కూడా చాలా రుచిగా ఉంటాయి. కూర లేన‌ప్పుడు వీటితో కూడా మ‌నం భోజ‌నం చేయ‌వ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల కారం పొడుల‌లో నల్ల కారం కూడా ఒక‌టి. ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే న‌ల్ల కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ల్ల కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు -ఒక క‌ప్పు, మిన‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 20, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

Nalla Karam Podi recipe in telugu make in this method
Nalla Karam Podi

న‌ల్ల కారం త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. చివ‌ర‌గా చింత‌పండు, వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. చ‌ల్లారిన త‌రువాత వీటన్నింటిని కూడా జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌ల్ల కారం త‌యార‌వుతుంది.దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. అలాగే వేపుడు కూరల్లో కూడా దీనిని వేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసిన న‌ల్ల కారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts