Nara Dishti : ప్రస్తుత కాలంలో అందరిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు యుగయుగాల నుండి వస్తున్న సమస్య. ద్వాసర యుగంలో కూడా కృష్ణుడు ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి, చెడు దృష్టి రెండూ ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పని చేసావు అని మంచిదృష్టితో పొగిడే వారు ఉన్నారు. అలాగే ఈర్షా, అసూయలతో, ద్వేషంతో పొగిడే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదిష్టి తగులుతుంది. నరదిష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం.
చిన్న పిల్లలకు ఈ నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్న పిల్లల్లో కడుపునొప్పి రావడం, అకారణంగా ఏడవడం, బలహీనంగా అవ్వడం వంటివి జరుగుతాయి. అలాగే కుటుంబంలో కలహాలు రావడం, సంపాదించిన డబ్బులు నిలబడకపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తతడం వంటివి జరుగుతాయి. నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. పూర్వకాలంలో పిల్లలకు దృష్టిదోష మంత్రాలు వేయించేవారు. నరదిష్టి తగిలినట్టుగా కూడా మనకుయ కొన్నిసార్లు తెలుస్తుంది. నరదిష్టి తగిలింది అని భావించగానే కొబ్బరి కాయ తిప్పి వేయడం, నిమ్మకాయ తిప్పి వేయడం, గుమ్మడికాయ తిప్పి వేయడం, ఉప్పు మరియు ఎండుమిరపకాయలు తిప్పి వేయడం వంటివి చేయాలి.
అలాగే మనం అందంగా నిర్మించుకున్న గృహాలకు కూడా దిష్టి తగులుతుంది. ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం, ఇంటికి గుమ్మడికాయను కట్టడం వంటివి చేయాలి. ఇలా మన పెద్దలు చెప్పిన అనేక పద్దతులను పాటిస్తూ ఉన్నాం. నరదిష్టిని తొలగించుకోవడానికి ఇలాంటి మార్గాలను మనం అనుసరిస్తూ ఉండాలి. కాకపోతే ఇవి ఎదుటి వారి మీద ప్రభావాన్ని చూపించకుండా ఉండాలి. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. దీంతో అవి సరిగ్గా పాలు ఇవ్వవు. మేత సరిగ్గా మేయవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది. దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్రవిరుద్దమైనవి కాకుండా శాస్త్రసమ్మతమైన ఈ పరిహార ప్రక్రియలను మన వంశాచారం, కుటుంబ ఆచారాలను పాటిస్తూ నరదిష్టి నుండి బయటపడాలి.
అలాగే యజ్ఞం చేసిన తరువాత వచ్చే బృహస్రామాన్ని తిలకంలా ధరిస్తే దిష్టి తగలకుండా ఉంటుంది. గృహా ప్రవేశం అప్పుడు చేసే హోమాలు, యజ్ఞాలు దృష్టిని తొలగించడంలో సహాయపడతాయి. గృహ ప్రవేశం అప్పుడు చేసే వాస్తూ బలి కూడా నరదిష్టి కోసం చేసేదే. ఎంతటి వారికైనా నరదిష్టి తగలక మానదు. ఈ పరిహారాలను పాటిస్తూ దిష్టి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దీంతో నరదిష్టి వల్ల కలిగే బాధల నుండి బయట పడవచ్చని పండితులు చెబుతున్నారు.