NTR : దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌ను సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన 4 ఏళ్లు ఈ సినిమాకు సమయం కేటాయించారు. కానీ చివరకు ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఎన్‌టీఆర్ కూడా ఈ సినిమాలో సెకండాఫ్ కారణంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
ఎన్‌టీఆర్ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ చురుగ్గానే పాల్గొన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం ఒక్కసారిగా డల్ అయ్యారు. దీంతో అసలు ఏమైంది ? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ సమయంలో ఎన్‌టీఆర్ తన సీన్లు ఏంటో చూశారు కదా.. మరి ఇప్పుడు డల్‌గా ఎందుకు కనిపిస్తున్నారు ? సినిమా పట్ల అసంతృప్తితో ఎందుకు ఉన్నారు ? అని ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ మూవీలో రామ్ చరణ్‌నే పూర్తిగా హైలైట్ చేశారని.. ఎన్‌టీఆర్‌ను పక్కన పెట్టేశారని ఫ్యాన్స్ అంటున్నారు. సెకండాఫ్‌లో మొత్తం రామ్ చరణ్‌నే ఎలివేట్ చేసి చూపించారని.. ఎన్‌టీఆర్ పాత్రకు సరైన న్యాయం చేయలేదని అంటున్నారు. సెకండాఫ్‌లో వాస్తవానికి ఎన్‌టీఆర్ సీన్లు 20 నిమిషాల మేర ఉన్నాయట. కానీ సినిమా నిడివిని ఇంకా తగ్గించాలని చెప్పి ఆ సీన్లను కట్ చేశారట. దీంతో ఎన్‌టీఆర్ పాత్రకు సెకండాఫ్‌లో ఎలివేషన్ లేకుండా పోయింది. డబ్బింగ్ సమయంలో ఆ సీన్లు ఉన్నా.. తరువాత వాటిని తొలగించారట. అందువల్ల సినిమా చూశాక తన సీన్లు అందులో లేవని ఎన్‌టీఆర్ విచారం వ్యక్తం చేశారట. కనుకనే ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా వెళ్తున్న చోట్లకు ఎన్‌టీఆర్ వెళ్లడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఎన్‌టీఆర్ బాగా హర్ట్ అయి అప్‌సెట్ అయ్యారట. అందుకనే డల్‌గా కనిపిస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఫ్యాన్స్ కూడా ఎన్‌టీఆర్ పాత్రకు న్యాయం చేయలేకపోయారని.. మొత్తం రామ్ చరణ్ పాత్రనే చివరకు హైలైట్ అయిందని అంటున్నారు. ఈ మూవీకి అంత సమయం కేటాయించినా ఎన్‌టీఆర్ పాత్రకు తగిన గుర్తింపు రాలేదని.. నార్త్ ఇండియాలోనూ రామ్ చరణ్ పాత్రకే ఆదరణ లభిస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోల రోల్స్ బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయని రాజమౌళి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు జరిగింది వేరే. మరి దీనిపై ఇప్పుడు రాజమౌళి ఏమంటారో చూడాలి.