Palak Egg Bhurji : కోడిగుడ్డు, పాల‌కూర క‌లిపి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Palak Egg Bhurji : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. పాల‌కూరలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో పాల‌కూర మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా పాల‌కూర‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పాల‌కూర ఎగ్ బుర్జీ కూడా ఒక‌టి. కేవ‌లం 15 నిమిషాల్లో ఈ క‌ర్రీని చేసుకోవ‌చ్చు. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌ను నేరుగా తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా క‌ర్రీని త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ ఎగ్ బుర్జీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌క్ ఎగ్ బుర్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన పాల‌కూర – 5 నుండి 6 క‌ట్ట‌లు లేదా 70 గ్రా., ఉప్పు – తగినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 4, వేయించిన ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్.

Palak Egg Bhurji recipe in telugu make in this way
Palak Egg Bhurji

పాల‌క్ ఎగ్ బుర్జీ త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ను గిన్నెలోకి తీసుకుని అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత పాల‌కూర వేసి క‌ల‌పాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి క‌లిపి పాల‌కూర‌ను మ‌గ్గించాలి. పాల‌కూర చ‌క్క‌గా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కారం వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత కోడిగుడ్లు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని చిన్న చిన్న ముక్క‌లుగా అయ్యేలా పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మ‌రో 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర ఎగ్ బుర్జీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాల‌కూర ఎగ్ బుర్జీని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts