Pepper Rasam : మిరియాల చారును 5 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు.. టేస్ట్ ఎంతో బాగుంటుంది..!

Pepper Rasam : మిరియాల ర‌సం.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల‌తో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. మిరియాల‌ను పొడిగా చేసి మ‌నం వంటల్లో వాడుతూ ఉంటాము. మిరియాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. పుల్ల పుల్ల‌గా ఘాటుగా ఉండే మిరియాల ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మిరియాల ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిరియాలు – ఒక టేబుల్ స్పూన్,జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 15, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 3, త‌రిగిన టమాటాలు – 3, ఉప్పు -త‌గినంత‌, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, క‌రివేపాకు – 4 రెబ్బ‌లు, ఇంగువ -పావు టీ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు.

Pepper Rasam recipe in telugu very easy to make
Pepper Rasam

మిరియాల ర‌సం త‌యారీ విధానం..

ముందుగా రోట్లో మిరియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచుకోవాలి. త‌రువాత చింత‌పండులో అర లీట‌ర్ నీళ్లు పోసి దాని నుండి ర‌సాన్ని తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండుమిర్చి, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు గుజ్జులాగా అయిన త‌రువాత చింత‌పండు ర‌సం, దంచిన మిరియాల మిశ్ర‌మం, క‌రివేపాకు, కొత్తిమీర‌, ఇంగువ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మరిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల ర‌సం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మిరియాల‌తో రుచిగా ర‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts