Prabhas : త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో చెప్పేసిన ప్ర‌భాస్‌..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ల‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఈయ‌న త‌న సినిమాల కోసం ఎప్పుడు బ‌య‌ట మీడియాతో మాట్లాడినా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అంటూ ఆయ‌న‌ను అడుగుతుంటారు. దీంతో ప్ర‌భాస్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌స్తున్నారు. అయితే తాజాగా జ‌రిగిన ఓ స‌మావేశంలో మాత్రం ఆయ‌న ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేశారు. త‌న‌కు అస‌లు పెళ్లి ఎందుకు కావ‌డం లేదో ఆయ‌న చెప్పేశారు.

Prabhas told real reason why his marriage is being delayed
Prabhas

ప్ర‌భాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ సినిమా ఇప్పటికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మార్చి 11వ తేదీన ఎట్టకేల‌కు ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అందులో భాగంగా ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లు పెట్టింది. వాటిల్లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు క‌లిసి పాల్గొంటున్నారు. ఇక తాజాగా వారు చిత్రానికి చెందిన రిలీజ్ ట్రైల‌ర్‌ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్ర‌భాస్‌, పూజా హెగ్డె.. మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. త‌న ప్ర‌తి సినిమా భిన్నంగా ఉండాల‌ని కోరుకుంటాన‌ని తెలిపారు. అందుక‌నే ఇలాంటి సినిమాలను తీస్తున్న‌ట్లు తెలిపారు. రాధే శ్యామ్ గత చిత్రాల‌తో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంద‌ని అన్నారు. బాలీవుడ్‌లో త‌న‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రేర‌ణ అని, స‌ల్మాన్ ఖాన్‌, షారూఖ్ ఖాన్ అంటే ఇష్ట‌మ‌ని ప్ర‌భాస్ తెలిపారు.

ఇక పెళ్లిపై అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. తాను ప్రేమ‌, పెళ్లి విష‌యాలను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోతున్నాన‌ని.. ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ని.. క‌నుక‌నే తాను ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని.. ఈ కార‌ణం వ‌ల్లే పెళ్లి ఆల‌స్యం అవుతుంద‌ని.. అన్నారు. అంటే.. ఆయ‌న త‌న‌కు న‌చ్చిన అమ్మాయి కోసం ఇంకా వెతుకుతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ప్ర‌భాస్‌కు న‌చ్చిన అమ్మాయి దొరుకుతుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

ఇక రాధేశ్యామ్ తోపాటు ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్ అనే చిత్రాల్లోనూ న‌టిస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ పూర్త‌యింది కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, గ్రాఫిక్స్ ప‌నుల్లో ఉంది. స‌లార్ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఆదిపురుష్ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు.

Editor

Recent Posts