Pudina Pulao : వంట చేసే స‌మ‌యం లేకపోతే.. 10 నిమిషాల్లోనే ఇలా పుదీనా పులావ్‌ను త‌యారు చేయ‌వ‌చ్చు..

Pudina Pulao : మ‌నం చేసే వంట‌ల రుచి, వాస‌న పెర‌గ‌డానికి ఉప‌యోగించే వాటిల్లో పుదీనా కూడా ఒక‌టి. పుదీనాను మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. వంట‌ల్లో పుదీనాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల వాటి రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. పుదీనాలో పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. త‌ర‌చూ పుదీనాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పుదీనాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. పుదీనాతో రుచిగా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుదీనా ఆకులు – ఒక క‌ప్పు, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – ఒక గ్లాస్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, యాల‌కులు – 2, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క ముక్క‌లు – 2 ( చిన్న‌వి), అనాస‌ పువ్వు – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 4 లేదా త‌గిన‌న్ని, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), క‌రివేపాకు – ఒక రెబ్బ‌, అల్లం ముక్క – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ట‌మాటా ఫ్యూరీ – పావు క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, ఉప్పు – త‌గినంత‌.

Pudina Pulao very easy and quick recipe
Pudina Pulao

పుదీనా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి మిర్చి ముక్క‌ల‌ను, క‌రివేపాకును వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ‌ల‌ను కూడా వేసి రంగు మారే వ‌ర‌కు బాగా వేయించాలి. ఉల్లిపాయ‌లు వేగుతుండ‌గానే ఒక జార్ లో అల్లం ముక్క‌ల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పుదీనా ఆకుల‌ను, కొద్దిగా నీటిని, ఉప్పును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పుదీనా మిశ్ర‌మాన్ని, ట‌మాట ఫ్యూరీని వేసి క‌ల‌పాలి. వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను, ఉప్పును వేసి క‌లపాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి మ‌రోసారి అంతా క‌లిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా పుదీనాతో ఎంతో రుచిగా పులావ్ ను చేసుకుని తినడం వ‌ల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ విధంగా చేసిన పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts