Gas Trouble : మారిన జీవన విధానం కారణంగా ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడితో సమయానికి తినకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల గ్యాస్, అసిడిటి, మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలు రావడానికి మూల కారణం అవుతోంది. ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. గ్యాస్ కారణంగా కడుపు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. దేనిని కూడా తినలేకపోతుంటారు. ఈ సమస్యల నుండి అప్పటికప్పుడు ఉపశమనం పొందడానికి మార్కెట్ లో దొరికే సిరప్ లను, పొడులను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఫలితం ఉంటుంది. కానీ వీటిని అధికంగా వాడకూడదు.
అధికంగా వాడడం వల్ల ఇతర జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా ఆయా సమస్యల నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల నిమిషాల్లోనే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిని కొద్దిగా వేడి చేయాలి. నీరు వేడైన తరువాత అందులో ఒక టీ స్పూన్ జీలకర్రను, కచ్చా పచ్చాగా దంచిన రెండు యాలకులను వేయాలి. తరువాత ఈ నీటిని సగం గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టాలి.
ఇలా వడకట్టిన నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నీటిని గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తాగడం వల్ల వెంటనే ఆయా సమస్యల నుండి నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఈ చిట్కా తయారీలో వాడిన జీలకర్ర, యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన జీర్ణసంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల సత్వర ఉపశమనం కలగడమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగకుండా ఉంటాయి.