vastu

ఇల్లు లేదా ఆఫీస్‌లో గుర్ర‌పు బొమ్మ‌ల‌ను ఇలా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది..!

ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం గుర్రాలు శ‌క్తికి ప్ర‌తిరూపం. ఇవి ఉన్న చోట పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. అందువ‌ల్ల ఇల్లు లేదా ఆఫీస్‌లో గుర్రాల బొమ్మ‌ల‌ను పెట్టుకుంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండ‌వు. ఇంట్లో అయితే ధ‌నం క‌లుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందువ‌ల్ల గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్టుకుంటే వాస్తు ప్ర‌కారం ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇల్లు లేదా ఆఫీసులో దక్షిణ దిశ‌లో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచాలి. దీంతో పేరు ప్ర‌ఖ్యాతులు వ‌స్తాయి. బిజినెస్‌లో చేపట్టే ప‌నులు విజ‌య‌వంత‌మ‌వుతాయి. ధ‌నం క‌లుగుతుంది.

* ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉత్త‌ర దిశ‌లో గుర్ర‌పు బొమ్మ‌ను ఉంచితే కెరీర్ ప‌రంగా సెట్ అవుతారు. ఆ స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారు, ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న వారు గుర్ర‌పు బొమ్మ‌ను ఉత్త‌ర దిశ‌లో పెట్టాలి. దీంతో ల‌క్ కూడా క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి.

* త‌లుపులు లేదా కిటికీల‌కు ఎదురుగా గుర్ర‌పు బొమ్మ త‌ల వ‌చ్చేలా పెడితే మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి.

put horse idols in home like this for wealth

* రెండు జంట గుర్ర‌పు బొమ్మ‌ల‌ను బెడ్ రూంలో పెట్టుకుంటే దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు ఉండ‌వు. గొడ‌వలు లేని కాపురంతో వారు సుఖంగా జీవిస్తారు. బెడ్‌రూంల‌లో ఎప్పుడు ఒంట‌రి గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్ట‌రాదు. జంట గుర్ర‌పు బొమ్మ‌ల‌నే పెట్టుకోవాలి.

* ఇక గుర్రపు బొమ్మ‌నే పెట్టుకోవాల్సిన ప‌నిలేదు. గుర్రం ఫొటోను ఇల్లు లేదా ఆఫీస్ లో వేలాడ‌దీసినా పైన చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి.

* ఏడు గుర్రాలు ప‌క్క ప‌క్క‌నే ప‌రిగెడుతున్న‌ట్టుగా ఉండే ఫొటో లేదా విగ్ర‌హాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. దీంతో ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం పోతుంది. స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే ఇట్టే ప‌రిష్కారం అయిపోతాయి.

* ప‌గ్గాల‌తో ఉండే గుర్ర‌పు బొమ్మ‌ల‌ను మాత్ర‌మే పెట్టాలి. ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్ర‌పు బొమ్మ‌ల‌ను పెట్ట‌రాదు. పెడితే అవి నెగెటివ్ ఎన‌ర్జీకి సంకేతాలు క‌నుక అదే ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. దీంతో అదృష్టం క‌ల‌సి రాదు. కనుక ప‌గ్గాలు లేదా జీనుతో ఉండే గుర్ర‌పు బొమ్మ‌ల‌నే పెట్టాల్సి ఉంటుంది. దీంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అంతా మంచే జ‌రుగుతుంది. అన్నింటా వృద్ధిలోకి వ‌స్తారు. సంప‌ద‌లు సిద్ధిస్తుంది.

Admin

Recent Posts