ఆధ్యాత్మికం

Shubha Drishti Ganapathy : ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకుంటే.. అస‌లు దిష్టి త‌గ‌ల‌దు..!

Shubha Drishti Ganapathy : నిత్యం ప్రతి ఒక్కరు కూడా గణపతని ఆరాధిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అంతా మంచే జరుగుతుంది. అయితే కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని పిలుస్తారు. దీని గురించి ఒక నానుడు కూడా మనకి తెలుసు. నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంద‌ని అంటారు. దీనిని పొందిన వాళ్ళ మీద పెద్ద ప్రభావమే పడుతుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది అన్నమాట.

సహజంగా మనం దేనినైనా చూస్తే ఎటువంటి హాని కూడా కలగదు. కానీ ఈర్ష్య‌ ద్వేషాలతో చూస్తే మాత్రం చెడు దృష్టి కలిగి హాని కలుగుతుంది. చెడు దృష్టి తాకే మనిషినైనా మరి ఇక దేనినైనా మాడి మసి చేస్తుంది. పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా అయితే మాడిపోతాయో అదేవిధంగా చెడు దృష్టి మనిషిపై అలా ప్రభావం చూపిస్తుంది. అయితే ఏ జబ్బునైనా సరే మందుల ద్వారా నయం చేయొచ్చు.

put Shubha Drishti Ganapathy like this to prevent dishti

కానీ దిష్టి దుష్ప్రభావాన్ని అణచివేసేందుకు ఏ మందు కూడా లేదు. అయితే సర్వశక్తివంతుడైన శుభ దృష్టి గణపతి ద్వారా దిష్టి నుండి బయటపడొచ్చు. అశుభదృష్టి తగలకుండా ఉండాలంటే ఈ గణపతిని పెట్టుకోండి చాలు. మహాగణపతి 33వ రూపమే ఈ శుభ దృష్టి గణపతి. ఈయన రూపం చాలా విచిత్రంగా ఉంటుంది.

మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవ శక్తి ఈయన. శుభ దృష్టి గణపతి ఒక్కరే దిష్టి అనే దృష్టిని సంహరించి మనల్ని రక్షించి సుఖసంతోషాలని ఇస్తాడు. శుభ దృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకుంటే దిష్టి బాధలు ఉండవు. ప్రతి రోజు శుభదృష్టి గణపతిని పూజించాలి. ఇంట్లోనే కాదు ఆఫీసు, ఫ్యాక్టరీలు, షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు. పూజ గదిలో లేదంటే ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే లాగా పెట్టుకోవచ్చు. అప్పుడు దిష్టి ఏమీ తగలదు.

Admin

Recent Posts