Pocket : మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు ఉన్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీ ఇంటిపైనే కాకుండా ఇంట్లో ఉండే వారిపై కూడా ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఈ నెగెటివ్ ఎనర్జీ నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మూడు వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీ వద్ద ఉంచుకోవలసిన వస్తువులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం మీ వద్ద ఉండాల్సిన వస్తువులల్లో అగ్గిపెట్టె కూడా ఒకటి. అగ్గి పెట్టె మీ వద్ద ఉండడం వల్ల దుష్టశక్తులు మీకు దూరంగా ఉంటాయి. మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది. అలాగే కర్పూరాన్ని కూడా ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు కలిసి వస్తుంది. అలాగే మీ దగ్గర ఉంచుకోవాల్సిన మరో వస్తువు బిర్యానీ ఆకు. దీనిని వంటలల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.
బిర్యానీ ఆకును మీ జేబులో ఉంచుకోవడం వల్ల రాహు సంబంధిత దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ ఆటంకం లేకుండా పనులు చేసుకోగలుగుతారు. ఈ విధంగా ఈ మూడు వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీకు దిష్టి తగలకుండా ఉంటుంది. ఎటువంటి దుష్టశక్తులు మీ దరి చేరకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.