food

Minappappu Masala Vada : మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Minappappu Masala Vada : మసాలా వ‌డ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది బ‌య‌ట బండ్ల‌పై తింటుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు వీటిని మ‌నం ఇంట్లోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే వాటి లాంటి రుచి వ‌స్తుంది. ఇక మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిన‌ప్ప‌ప్పుతో మ‌సాలా వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొట్టు మిన‌ప్ప‌ప్పు – ఒక క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 5, అల్లం – చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, మెంతికూర త‌రుగు – పావు కప్పు, కొత్తిమీర త‌రుగు – పావు క‌ప్పు, వాము – 1 టీస్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, కారం – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

minappappu masala vada recipe in telugu

మిన‌ప్ప‌ప్పు మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేసే విధానం..

మిన‌ప్ప‌ప్పును నాలుగైదు గంల ముందు నాన‌బెట్టుకోవాలి. ఆ త‌రువాత చాలా కొద్దిగా నీళ్లు చ‌ల్లుకుంటూ మెత్త‌గా గారెల పిండిలా రుబ్బుకోవాలి. అదేవిధంగా ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుతోపాటు నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను పిండిలో క‌లిపి త‌రువా వ‌డ‌ల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్ర‌గా వేయించుకుని తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మిన‌ప్ప‌ప్పు మ‌సాలా వ‌డ‌లు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా చ‌ట్నీతో తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts