వినోదం

రూ.2 కోట్ల అప్పు.. కొడుకు స్కూల్ ముందు కూర‌గాయ‌లు అమ్మిన ప్ర‌ముఖ న‌టుడు..

రాజేష్ కుమార్.. ఈ నటుడి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ చిత్రంలో రోసేష్ పాత్రకు అత‌నికి మంచి పేరు వ‌చ్చింది. అయితే రాజేష్ కుమార్ రీసెంట్‌గా త‌న జీవితంలో ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల గురించి మీడియాతో ముచ్చ‌టించాడు. ఆ విష‌యాలు వైర‌ల్‌గా మారాయి. న‌టుడుగా కెరీర్ సాగుతున్న స‌మ‌యంలో రాజేష్ కుమార్ రైతుగామారాల‌ని అనుకున్నాడు. నటనను విడిచిపెట్టి, 2017లో బీహార్‌లోని తన గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకున్నారు.

మా ఊరిలో కొంత భూమి ఉంది. వ్య‌వ‌సాయం చేస్తాన‌ని మా నాన్న‌కి చెప్పాను. నాన్న నేనేదో రెండు లేదా మూడు నెల‌లు చేస్తాన‌ని అనుకున్నాడు. కాని నా ప్ర‌యాణం కొన‌సాగింది. వ్య‌వ‌సాయం మెళుకువ‌లు నేర్చుకొని పంట పండించాల‌ని అనుకున్నారు. అయితే వారి గ్రామంలో 30 ఏళ్లుగా పొలాలు ఎలాంటి ముంపుకి గురి కాలేదు. కాని తాను వ్య‌వ‌సాయం ప్రారంభించిన‌ప్పుడు భారీ వర్షాలు కురిసి, వరదల‌తో మొత్తం దెబ్బతింది. వర్షం కారణంగా అతని పంట మొత్తం పాడైపోయింది. దాదాపు మూడేళ్ల‌పాటు త‌న ప‌రిస్థితి అలానే కొన‌సాగ‌డంతో దీవాలా తీసే ప‌రిస్థితికి చేరుకున్న‌ట్టు రాజేష్ వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయం కోసం తాను రెండు కోట్ల వ‌ర‌కు అప్పు చేసిన‌ట్టు కూడా రాజేష్ తెలియ‌జేశాడు

rajesh kumar sold vegetables at his son school

వ్యవసాయంలో ముందస్తు అనుభవం మరియు నైపుణ్యం లేకపోవడంతో, నేను భారీ నష్టాలను చవిచూశాన.. అప్పులు తీర్చాల్సి రావ‌డంతో నేను చాలా స‌వాళ్ల‌ని ఫేస్ చేశాను. కోవిడ్ స‌మ‌యంలో నా ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఐదు సంవ‌త్స‌రాల పాటు దారుణ‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొ్నాడు.రాజేష్ తను చేసిన వ్య‌వ‌సాయం విజయవంతం కాలేదని, డబ్బు సంపాదించడానికి కూరగాయలు అమ్మవలసి వచ్చిందని చెప్పాడు. అతను తన కొడుకు పాఠశాల వెలుపల కూరగాయల దుకాణాన్ని ఎలా ఏర్పాటు చేశాడో, అక్కడ తన కొడుకు ఉపాధ్యాయులని త‌న తండ్రి ద‌గ్గ‌ర కూరగాయలు కొనుగోలు చేయమని అడిగాడని అతను గుర్తు చేసుకున్నాడు. అత‌ను వ్య‌వ‌సాయం చేయాల‌ని అనుకున్న‌ప్పుడు ఎవ‌రు సాయం చేయ‌లేద‌ని, భార్య ,ఫ్యామిలీ మాత్ర‌మే త‌నకి స‌పోర్ట్‌గా నిలిచార‌ని రాజేష్ పేర్కోన్నాడు.

Sam

Recent Posts