వినోదం

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Ram Charan : చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేయడం రివాజు. అయితే కొన్నిసార్లు ఎడిటింగ్ లో కట్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీర మూవీతో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

హిట్స్, ప్లాప్స్ కూడా రుచి చూసిన చెర్రీ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీలో నటించాడు. మరోపక్క తండ్రి చిరంజీవితో ఆచార్య మూవీ నిర్మించాడు. మరోవైపు శంకర్ డైరెక్షన్ లో కూడా చెర్రీ నటిస్తున్నాడు. అయితే చిన్నప్పుడు ఒక సినిమాలో చెర్రీ నటించినట్లు బయట పడింది. కానీ ఎడిటింగ్ లో తొలగించారట.

Ram Charan acted as child artist in a movie

దర్శకరత్న దాసరి నారాయణరావు 100వ చిత్రం లంకేశ్వరుడులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు. భారీ అంచనాలతో ఈ మూవీ రూపుదిద్దుకుని విడుదలైంది. అయితే ఇందులో చెర్రీ బాలనటుడిగా నటించినప్పటికీ ఎడిటింగ్ లో పోయింది. నిజానికి చాలా మంది డైరెక్టర్స్ చెర్రీని బాలనటుడిగా చూపించాలని అనుకున్నా కుదరలేదు. దాసరి మూవీలో నటించినప్పటికీ సినిమాలో సీన్ లేదు. అయితే మళ్ళీ ఎప్పుడూ చెర్రీ బాలనటుడిగా నటించలేదు. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. తండ్రిని మించిన త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు.

Admin

Recent Posts