business ideas

Business Idea : వేల‌లో పెట్టుబ‌డి పెడితే.. ల‌క్ష‌ల్లో సంపాదించుకునే స్వ‌యం ఉపాధి మార్గం.. ఏమిటంటే..

Business Idea : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రైతులు సంప్ర‌దాయ పంట‌లను కాకుండా భిన్న ర‌కాల‌కు చెందిన పంట‌ల‌ను పండిస్తున్నారు. అందులో భాగంగానే మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగకు బ‌దులుగా ఇత‌ర పంట‌ల‌ను పండిస్తూ లాభాల‌ను గడిస్తున్నారు. అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు ధర లభించక చాలా నష్టపోతుంటారు. ఈ రకం పంటల‌ను వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి పంటలను రైతులు పండించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక లాభ‌దాయ‌క‌మైన పంట‌ల్లో లెమ‌న్ గ్రాస్ ఒక‌టి. దీంతో స్థిర‌మైన ఆదాయం పొంద‌వ‌చ్చు.

ఇక లాభదాయక పంటల్లో లెమన్ గ్రాస్ ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. అనగా నిమ్మ గడ్డి.. ఈ నిమ్మగడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఫేషియల్ ప్రొడక్ట్స్, సోప్స్ తయారీలో ఈ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ గడ్డి అన్ని రకాల భూముల్లో పండుతుంది. దీన్ని పండించడానికి నీరు కూడా పెద్దగా అవసరం లేదు. ఈ నిమ్మగడ్డి పంటకు ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే కనుక లక్షల రూపాయల్లో ఆదాయం వస్తుందని నిపుణులు కొందరు చెబుతున్నారు.

with lemon grass crop you can earn in lakhs

నిమ్మగడ్డి విత్తనాలు ఒక ఎకరాకు రెండు కిలోల వరకు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను ఒక్కసారి నాటితే దాదాపు నాలుగేళ్ల వరకు పంట వస్తుంది. ఇక ఈ గడ్డిని నాటిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోసేయాలి. అలా పంట కూడా వెంటనే వస్తుంది. అలాగే గడ్డి నుంచి వచ్చే సువాసన కూడా బాగుంటుంది. ఇక ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ఒక లీటర్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉండటం విశేషం. ఎకరం భూమికి మార్కెట్ లో రేటును బట్టి సుమారు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. లెమ‌న్ గ్రాస్‌ను ఒక ఎక‌రం భూమిలో పండించినా అద్భుత‌మైన లాభాలు వ‌స్తాయి. క‌నుక స్వ‌యం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పంట‌ను పండించి ఆదాయం పొంద‌వ‌చ్చు. దీనికి మార్కెట్‌లో కూడా బాగానే డిమాండ్ ఉంది.

Admin

Recent Posts