Samantha : గతేడాది ఇదే సమయంలో సమంత, నాగచైతన్య బెస్ట్ కపుల్‌గా ఉన్నారు. బహుశా విడిపోతామని వారు కూడా అనుకోలేదు కాబోలు. ఎవరి దిష్టి తాకిందో ఏమో తెలియదు కానీ.. ఈ ప్రేమ జంట విడిపోయింది. ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలోనే గతేడాది ఇదే సమయంలో కలసి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్న ఈ జంట ఈసారి ఒంటరిగా, విడివిడిగా ఉన్నారు. దీంతో వాళ్ల బాధను చూసి ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రేమికుల రోజు సందర్భంగా సమంత కూడా ఆ రోజును జరుపుకుంది. కాకపోతే తన స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో కాదు.. వీధి కుక్కలతో. అవును.. సమంతకు సహజంగానే కుక్కలు అంటే ఎంతో ప్రేమ. ఆమె తన పెంపుడు కుక్కలతో కాలక్షేపం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం రోజున ఆమె వీధి కుక్కలతో సరదాగా గడిపింది. దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది.
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా సమంతకు ఆమె స్నేహితులు కొందరు గ్రీటింగ్ కార్డులను, గిఫ్టులను కూడా పంపించారు. వాటి వివరాలను కూడా సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే యశోద అనే పాన్ ఇండియా మూవీతోపాటు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే సినిమాలోనూ నటిస్తోంది.