Silver Elephant Idol : వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహంచని మార్పులు జ‌రుగుతాయి..!

Silver Elephant Idol : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అస‌లు స‌మ‌స్య‌లు లేని మ‌నిషి ఉండ‌డు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే చాలా మందికి ఉండే స‌మ‌స్య‌ల్లో ఆర్థిక స‌మ‌స్యలు ఒక‌టి. త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ క‌ల‌హాలు ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను ఒక ప్ర‌త్యేక‌మైన స్థానంలో పెట్ట‌డం వ‌ల్ల ఆయా స‌మస్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయ‌కుడికి విఘ్నేశ్వ‌రుడ‌నే ఇంకో పేరు కూడా ఉంది. అంటే.. ఆయన మ‌న‌కు క‌లిగే విఘ్నాల‌ను తొల‌గిస్తాడ‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను ప్ర‌తిబింబించేలా వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అనేక విష‌యాల్లో మ‌నం విజ‌యం సాధించ‌వ‌చ్చు. అన్ని స‌మ‌స్య‌ల నుంచి విముక్తి చెంద‌వ‌చ్చు. మ‌నం ఏ ప‌ని చేసినాలో అందులో విఘ్నాలు రావు. విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. అలాగే వెండి ఏనుగు బొమ్మ‌కు సైజుతో సంబంధం లేదు. ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా స‌రే.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే స‌మ‌స్య‌లు పోతాయి.

Silver Elephant Idol can bring you good luck and wealth
Silver Elephant Idol

వెండి ఏనుగు బొమ్మ‌ను ఇంట్లో ఉత్త‌రం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి స‌భ్యులు ఎవ‌రైనా అనారోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటే వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల అనారోగ్యాల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. ఇక ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మ‌ను పెట్టుకుంటే ఆఫీసులో లేదా వ్యాపారం ప‌రంగా ఉండే అన్ని స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌. అలాగే ఇంట్లో దేవుడి గ‌దిలో వెండి ఏనుగు బొమ్మ‌ను పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతార‌ట‌. ఈ విధంగా వెండి ఏనుగు బొమ్మ‌ను వివిధ స్థానాల్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల ప‌లు లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts