Snake Repellent Plants : మన ఇంటి చుట్టూ పరిసరాల్లో అనేక రకాల కీటకాలు, ప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. వీటిలో పాములు కూడా ఒకటి. పాములు కూడా మన ఇంటి చుట్టు పరిసరాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఇది సహజమే. అయితే పాములు విషపూరితమైనవి. వీటి వల్ల మనం కొన్నిసార్లు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటాము. ఈ పాముల సంచరం వర్షాకాలంలో మరి ఎక్కువగా ఉంటుంది. కలుగుల్లో, పుట్టల్లో ఉన్న పాములన్నీ బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ పాముల వల్ల మనకు హాని కలగకుండా ఉండాలంటే ఇవి మన ఇంటి చుట్టు పక్కలకు రాకుండా ఉండాలంటే మనం ఇంటి పరిసరాల్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి. ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల పాములు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
పాములను రాకుండా చేసే మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాములను రాకుండా చేసే మొక్కలల్లో బంతిపూల మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. దాదాపు దీనిని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. బంతిపూల మొక్కలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరించకుండా ఉంటాయి. బంతిపూల నుండి వచ్చే వాసన కారణంగా పాముల వాటి దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే మన పెరట్లో మదర్ ఇన్ లాస్ టంగ్( స్నేక్ ప్లాంట్) అనే మొక్కను పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అదే విధంగా మన ఇంటి చుట్టు, పెరట్లో నిమ్మగడ్డి ( లెమన్ గ్రాస్) మొక్కను పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. లెమన్ గ్రాస్ నుండి వచ్చే ఘాటైన వాసన వల్ల పాములు, ఇతర కీటకాలు వాటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇక మన ఇంటి చుట్టు పెరట్లో వెల్లుల్లిని పెంచుకోవడం వల్ల కూడా పాములు, కీటకాలు రాకుండా ఉంటాయి. అదే విధంగా నేల వేము మొక్క కూడా పాములు మన ఇంటి చుట్టు పక్కలకు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. అదే విధంగా సర్ఫగంధ( పాతాళ గరిడి) మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అలాగే పింక్ అగపాంతస్ మొక్కను, మాచిపత్రి మొక్కను మన ఇంటి చుట్టు అదే విదంగా పెరట్లో పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. ఈవిధంగా ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల పాములు మన ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.