Soft Bread Omelette : బ్రెడ్ ఆమ్లెట్ మెత్త‌గా రుచిగా రావాలంటే.. ఇలా చేయండి..!

Soft Bread Omelette : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల స్నాక్ ఐట‌మ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అల్పాహారంగా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు, అల్పాహారంగా ఏం త‌యారు చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా బ్రెడ్ ఆమ్లెట్ ను త‌యారుచేసుకుని తిన‌వ‌చ్చు. అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డే బ్రెడ్ ఆమ్లెట్ ను మెత్త‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 3, కోడిగుడ్లు – 4, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ .

Soft Bread Omelette recipe in telugu make in this way
Soft Bread Omelette

బ్రెడ్ ఆమ్లెట్ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను బ‌ట‌ర్ వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. ఈ కోడిగుడ్ల‌ను నురుగు వ‌చ్చేలా బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప‌మిగిలిన ప‌దార్థాల్నీ వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి ఆమ్లెట్ లా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత దీనిపై బ్రెడ్ ను ఉంచాలి. ఈ బ్రెడ్ పై మ‌రొ కొద్దిగా కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న త‌రువాత ఆమ్లెట్ ను మో వైపుకు తిప్పి మ‌ర‌లా మూత పెట్టి మ‌రో అర నిమిషం పాటు కాల్చుకోవాలి. త‌రువాత ఆమ్లెట్ అంచుల‌ను మ‌డిచి ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా, సాఫ్ట్ గా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ త‌యార‌వుతుంది. అల్పాహారంగా తింటే ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన బ్రెడ్ ఆమ్లెట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts