Wheat Flour Sponge Cake : ఓవెన్ లేకున్నా స‌రే గోధుమ పిండితో ఎంతో మెత్త‌ని స్పాంజ్ కేక్‌.. త‌యారీ ఇలా..!

Wheat Flour Sponge Cake : కేక్.. మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే వాటిలో ఇది కూడా ఒక‌టి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా దీనిని అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటాము. సాధార‌ణంగా కేక్ ను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం మైదాపిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే కేక్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిదికాదు క‌నుక మైదాపిండికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండిని ఉప‌యోగించ‌డం మంచిది. అయితే గోధుమ‌నిండితో కేక్ ఎలా త‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల గోధుమ‌పిండిఓ కూడా మ‌నం రుచిగా, స్పాంజ్ లాగాఉండే కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కేక్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం కూడా. ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా రుచిగా గోధుమ‌పిండితో కేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ‌పిండి కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 2, పంచ‌దార – అర క‌ప్పు, నూనె – పావు క‌ప్పు, కాచిచ‌ల్లార్చిన పాలు – పావు క‌ప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, చాకో చిప్స్ – ఒక టేబుల్ స్పూన్.

Wheat Flour Sponge Cake recipe in telugu make this without oven
Wheat Flour Sponge Cake

గోధుమ‌పిండి కేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో పంచ‌దార‌, పాలు, వెనీలా ఎసెన్స్, నూనె వేసి మ‌రో 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెపై జ‌ల్లెడ‌ను ఉంచి అందులో గోధుమ‌పిండి, బేకింగ్ పౌడ‌ర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జ‌ల్లించాలి. త‌రువాత అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. చివ‌ర‌గా చాకో చిప్స్ వేసి క‌లపాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద గిన్నెను ఉంచి అందులో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత బేకింగ్ ట్రేను తీసుకుని దానికి బ‌ట‌ర్ ను లేదా నెయ్యిని రాసుకోవాలి. త‌రువాత దీనిపై బ‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచాలి లేదా మైదాపిండిని చ‌ల్లుకోవాలి.

ఇప్పుడు కేక్ మిక్స్ ను ట్రేలో వేసుకుని ట్రేను ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ట్రేను ముందుగా ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 30 నుండి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ట్రేను బ‌య‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత కేక్ ను ట్రే నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత కేక్ ను క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి కేక్ త‌యార‌వుతుంది. ఈ కేక్ రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎక్కువ‌గా హాని కల‌గ‌కుండా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన కేక్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts