Sreeleela : పెళ్లి సంద‌డి బ్యూటీ శ్రీ‌లీల‌.. డాక్ట‌ర‌మ్మ అయిందోచ్‌..!

Sreeleela : సినీ రంగంలోకి వ‌చ్చిన త‌రువాత సెల‌బ్ర‌టీలు చాలా మంది విద్యాభ్యాసాన్ని మ‌ధ్య‌లోనే మానేస్తుంటారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌.. ఇలా ఏ కోర్సు చ‌దువుతున్నా.. సినీ రంగంలోకి వ‌చ్చాక వారు చ‌దువు ఆపేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు చ‌దువు కొన‌సాగిస్తుంటారు. తాము క‌ల‌లు క‌న్న డిగ్రీల‌ను సాధిస్తుంటారు. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇలా చ‌దివిన వారు ఉన్నారు. ఇక పెళ్లి సంద‌డి బ్యూటీ శ్రీ‌లీల కూడా ఇదే జాబితాకు చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ అమ్మడికి ప్ర‌స్తుతం చేతిలో పుష్క‌లంగా అవ‌కాశాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె ఎంబీబీఎస్ విద్య‌ను పూర్తి చేసింది. డాక్ట‌ర్ అయింది.

sreeleela passed mbbs exam
Sreeleela

శ్రీ‌లీల త‌న తొలి సినిమా పెళ్లి సంద‌డి విడుద‌ల కాగానే ఎంబీబీఎస్ ప‌రీక్ష‌లు రాసేందుకు ముంబై వెళ్లింది. ఈ క్ర‌మంలోనే ఆ ప‌రీక్ష‌ల‌కు చెందిన రిజల్ట్స్ తాజాగా వ‌చ్చాయి. శ్రీ‌ల‌ల ఆ ప‌రీక్ష‌ల్లో పాస్ అయింది. దీంతో ఈమె డాక్ట‌ర్ అయింది. సాధార‌ణంగా ఇలా సినీ రంగంలో ఉన్న‌వారు డాక్ట‌ర్ కావ‌డం అనేది అత్యంత అరుదుగా జ‌రుగుతుంటుంది. అప్ప‌ట్లో హీరోయిన్ రాధ‌.. త‌రువాత మొన్నీ మ‌ధ్యే సాయిప‌ల్ల‌వి.. డాక్ట‌ర్ విద్య‌ను పూర్తి చేశారు. సాయిపల్ల‌వి విదేశాల్లో వైద్య విద్య‌ను అభ్య‌సించింది. అయితే ఆమె ఇక్క‌డ డాక్ట‌ర్‌గా కొన‌సాగాలంటే అందుకు సంబంధించి ఓ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ఆమె ఆమ‌ధ్య ఆ ప‌రీక్ష రాసి పాస్ అయింది. ఇక ఇప్పుడు శ్రీ‌లీల ఎంబీబీఎస్ పాస్ అయింది.

అయితే శ్రీ‌లీల‌కు ప్రస్తుతం చేతిలో పుష్క‌లంగా అవ‌కాశాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె అంత బిజీ షెడ్యూల్‌లో డాక్ట‌ర్ ప‌రీక్ష‌లను రాసి పాస్ అయిందంటే చాలా గ్రేట్ అని చెప్ప‌వ‌చ్చు. శ్రీ‌లీల తాజాగా ర‌వితేజ‌తో క‌లిసి ధ‌మాకా అనే చిత్రంలో న‌టిస్తోంది. ఆ మూవీకి చెందిన ఫ‌స్ట్ లుక్‌ను ఈ మ‌ధ్యే రిలీజ్ చేశారు. అందులో శ్రీ‌లీల ఎంతో ఆక‌ట్టుకునే విధంగా క‌నిపించింది.

Admin

Recent Posts