Sri Reddy : ఈసారి మ‌ట‌న్ క‌ర్రీ వండిన శ్రీ‌రెడ్డి.. చూస్తేనే నోరూరిపోతుంది.. వీడియో..!

Sri Reddy : శ్రీ‌రెడ్డి పేరు చెబితేనే ఆమె చుట్టూ ఉండే వివాదాలు గుర్తుకు వ‌స్తుంటాయి. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే త‌ర‌చూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతుంటుంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఈమెకు అస్స‌లు ప‌డ‌దు. ఆ నేప‌థ్యంలోనే మొన్నా న‌డుమ ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం జ‌గ‌న్‌ను తిట్టార‌ని చెప్పి శ్రీ‌రెడ్డి ఆయ‌న‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టేసింది. కొద్ది రోజుల పాటు ఈ అంశంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అయితే ఈమె ఇప్పుడు రూటు మార్చింది. త‌ర‌చూ ఏదో ఒక వంట చేస్తూ దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ అల‌రిస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌లే ఆమె బంగారు తీగ చేప‌ల పులుసు చేయ‌గా.. ఇప్పుడు మ‌ట‌న్ క‌ర్రీ వండింది.

Sri Reddy  cooked mutton curry video viral
Sri Reddy

శ్రీ‌రెడ్డి అంటేనే.. గ్లామ‌ర్ షో అనే ప‌దం గుర్తుకు వ‌స్తుంది. ఆమె ఏం చేసినా గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తుంటుంది. ఇక వంట‌ల వీడియోల‌లో అయితే ఆమె గ్లామ‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అదే ప‌ద్ధ‌తిలో తాజాగా ఇంకో వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఇప్పుడు మ‌ట‌న్‌తో మ‌ట‌న్ ఘీ రోస్ట్ చేసింది. శ్రీ‌రెడ్డి చేసిన వంట‌ను చూస్తుంట‌నే నోరూరిపోతోంది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు ఆమె వీడియోపై ఇప్ప‌టికే కామెంట్లు కూడా చేశారు.

శ్రీ‌రెడ్డి వండిన మ‌ట‌న్ వెరైటీ కూర‌ను తినాల‌ని ఉంద‌ని చాలా మంది నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. ఇక ఈమె మ‌ట‌న్ క‌ర్రీ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను వీక్షిస్తున్నారు.

Share
Editor

Recent Posts