వినోదం

Sridevi : శ్రీదేవి.. చిరంజీవితో అంత పొగ‌రుగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే ఆ సినిమా ఆగిందా?

Sridevi : మెగాస్టార్ చిరంజీవి చాలా సౌమ్యంగా ఉంటారు. ఎదుటి వారు త‌న‌ను విమ‌ర్శించిన కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. పెద్ద‌గా వివాదాల జోలికి వెళ్లారు. అయిన కూడా కొంద‌రు కావాల‌ని త‌న‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. శ్రీ‌దేవి ఒక సినిమా షూటింగ్‌ స‌మయంలోచిరంజీవిని చాలా ఇబ్బంది పెట్టింద‌ట. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టి వేరే హీరోయిన్స్‌తో క‌లిసి సినిమా చేశాడు. ఆ సినిమా మ‌రేదో కాదు కొండ‌వీటి దొంగ‌.ఈ సినిమాలో ముందుగా శ్రీదేవిని క‌థానాయిక‌గా అనుకోగా, ఆమె పెట్టిన కండీష‌న్స్ వ‌ల‌న విజ‌య‌శాంతి, రాధా ఈ ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చి చేరారు.

అయితే కొండ‌వీటి దొంగ కోసం శ్రీదేవి పెట్టిన కండీష‌న్ ఏంటంటే.. టైటిల్ మార్పు. కోదండ‌రామిరెడ్డి చెప్పిన‌ క‌థంతా విన్న శ్రీ‌దేవి టైటిల్ పేరు మార్చాల‌ని కొండ‌వీటి రాణి కొండ‌వీట దొంగ పెట్ట‌మ‌ని చెప్పింది. ఇందులో త‌న పాత్ర తో స‌మానంగా హీరో పాత్ర ఉండాలి. హీరో , ప్రేమ అంటూ త‌న చుట్టూ తిర‌గ‌కూడ‌దు అని కండీషన్స్ పెట్టింది. ఆ కండీష‌న్స్‌కి చిరంజీవికి కోపం రావ‌డంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది జ‌రిగిన రెండేళ్ల త‌ర్వాత చిరంజీవి, విజ‌య‌శాంతి, రాధా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ సినిమా రూపొంది సూప‌ర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వ‌చ్చిన రెండు నెల‌ల‌కు విడుద‌ల జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి ద‌గ్గ‌ర కూడా శ్రీ‌దేవీ చిరాకు పెట్టింది.

sridevi behavior with chiranjeevi is not good

ముందు ఈ సినిమాకు జ‌గ‌దేక వీరుడు అని టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీ‌దేవి అడ్డు చెప్ప‌డంతో అతిలోక సుంద‌రి యాడ్ చేసి సినిమా తెర‌కెక్కించారు. ఇక చిరంజీవి శ్రీ‌దేవి క‌లిసి మొద‌టిసారిగా మోస‌గాడులో క‌లిసి న‌టించారు. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక పాట కూడా ఉంటుంది. ఆ త‌రువాత రాణి కాసుల రంగ‌మ్మ, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, ఎస్పీ ప‌రుశురామ్ వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Admin

Recent Posts