Off Beat

ట్యూబ్‌లో ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌లోని రంగులు ఎందుకు కలిసిపోవు ?

మార్కెట్‌లో మనకు రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతాయి. కొన్నింటిని కృత్రిమ పదార్థాలతో తయారు చేస్తారు. అయితే కొన్ని టూత్‌ పేస్ట్‌లు కేవలం ఒకే రంగులో కాక భిన్న రంగుల్లో ఉంటాయి. ట్యూబ్‌ ను ప్రెస్‌ చేసినప్పుడు బయటకు వచ్చే పేస్ట్‌ భిన్న రంగుల్లో ఉంటుంది. ఇలాంటి టూత్‌ పేస్ట్‌లు కూడా మనకు లభిస్తున్నాయి.

అయితే రంగుల్లో ఉండే టూత్‌ పేస్ట్‌ ట్యూబ్‌ లోపల ఉన్నప్పుడు ఎందుకు కలిసి పోదు ? అన్ని రంగులు ఎందుకు మిక్స్‌ అవ్వవు ? అంటే..

why the colors in toothpaste are not mixed

టూత్‌ పేస్ట్‌ ట్యూబ్‌లో ఉన్నప్పుడు సాలిడ్‌గానే ఉంటుంది. అంటే ఘన రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ పేస్ట్‌లోని రంగులు ఎక్కడ ఉన్నవి అలాగే ఉంటాయి. కదలవు, కలిసిపోవు. కానీ మనం ట్యూబ్‌ను ప్రెస్‌ చేసినప్పుడు టూత్‌ పేస్ట్‌ బయటకు రావాలి కనుక అది ఫ్లుయిడ్‌ రూపంలోకి మారుతుంది. మనం ట్యూబ్‌ను ప్రెస్‌ చేయగానే అది ఫ్లుయిడ్‌ గా మారి వెంటనే బయటకు వస్తుంది. అలా వచ్చే క్రమంలో రంగులు కలసిపోతాయి. ఇలా రంగుల టూత్‌ పేస్ట్‌ బయటకు వస్తుంది.

Admin

Recent Posts