వినోదం

NTR : చనిపోయే రెండు రోజుల ముందు ఎన్టీఆర్‌కి సీక్రెట్ చెప్పిన శ్రీదేవి..!

NTR : నార్త్, సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి గురించి స్పెషల్ చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఏ నటికీ రానంత గుర్తింపును సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో యాక్ట్ చేసి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. అలాంటి నటి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఇప్పటికి ఎప్పటికీ.. శ్రీదేవి లేని లోటు తెలుస్తూనే ఉంటుంది.

శ్రీదేవి ఉన్నప్పుడే ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె కూతురు సినిమా రిలీజ్ కాకముందే శ్రీదేవి కన్నుమూశారు. శ్రీదేవి మరణంతో యావత్ సినీ ప్రపంచమే దిగ్బ్రాంతికి గురయ్యింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులంతా కలిసి ఓ కార్యక్రమం కూడా చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఆమె చనిపోయేందుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఓ సీక్రెట్ చెప్పారట.

what sridevi told to jr ntr before her death

ఈ ఫోన్ సంభాషణలో ఎన్టీఆర్ తో శ్రీదేవి.. తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందని, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నీతోనే ఎంట్రీ ఇవ్వాలనేది నా కోరిక అని తెలిపారని ఎన్టీఆర్ అన్నారు. ఒకప్పుడు మీ తాతయ్య, నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశామని, అలాగే మీరిద్దరూ కూడా అలా నటిస్తే.. మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు మేమిద్దరం గుర్తుకు రావాలని శ్రీదేవి చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అలా చెప్పిన రెండు రోజులకే శ్రీదేవి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఎన్టీఆర్ అన్నారు.

Admin

Recent Posts