ఆధ్యాత్మికం

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఉండాలంటే.. ఎలాంటి సుగుణాల‌ను క‌లిగి ఉండాలో తెలుసా..?

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే, దేనికి కూడా కొరత ఉండదు. సుఖసంతోషాలతో ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, చాలామంది పూజలు కూడా చేస్తూ ఉంటారు. శుక్రవారం అయితే, ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. ఇంటి గడపకి పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెడుతూ ఉంటారు. పూలతో పూజ గదిని అలంకరిస్తారు. ఇంట్లో దేవుడి గదిలో పూలు, పండ్లతో చక్కగా పూజలు చేస్తారు. లక్ష్మీదేవి రావాలని పాటలు పాడడం, శ్లోకాలు చదవడం, మంత్రాలు చదవడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు.

శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రత్యేకం. అందుకని, చాలామంది రకరకాల నియమాలని పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందనే విషయాన్ని మహావిష్ణువు వివరించారు. శంఖం శబ్దం వినపడని చోట లక్ష్మీదేవి ఉండదట. అలానే, అతిధులకి భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి. ఇది ఎప్పటినుండో పాటిస్తున్న ఆచారం. తులసిని పూజించని చోట, లక్ష్మీదేవి ఉండదు అని మహా విష్ణువు చెప్పడం జరిగింది.

these good habits are must for lakshmi devi blessings

అలానే, ఇల్లు కళకళ్లాడుతూ ఉండాలట. నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి. అటువంటి ఇంట్లో, లక్ష్మీదేవి ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె కంటతడి పెట్టకూడదు ఒకవేళ కనుక కంటతడి పెడుతూ ఉన్నట్లయితే. లక్ష్మీదేవి అక్కడ నివసించదని మహా విష్ణువు చెప్పారు. చెట్లని నరికే చోట కూడా లక్ష్మీదేవి ఉండదు.

సూర్యోదయం సమయంలో, భోజనం చేసే వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదని చెప్పారు మహా విష్ణువు. తడి పాదాలతో నిద్రపోయే చోటు కూడా లక్ష్మీదేవి ఉండదు. తులసి దేవిని పూజించే చోట, శంఖ ధ్వని వినపడే చోట లక్ష్మీదేవి ఉంటుంది. కనుక, ఈ విషయాలని గుర్తుపెట్టుకుని ఆచరించండి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, సంతోషంగా ఉండవచ్చు.

Admin

Recent Posts