సముద్రం దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఈత వచ్చినప్పటికీ గ్రహచారం బాగా లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఇక ఈత రాని వారి పరిస్థితి సరే సరి. అటు నుంచి అటే పలాయనం చిత్తగించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లున్నాయి. అదృష్టవశాత్తూ రక్షింపబడ్డారు. ప్రాణాపాయం తృటిలో తప్పింది. కాస్త ఉంటే సముద్రంలోకి పోయేవారే. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సముద్రం దగ్గర బీచ్ ఒడ్డున ఉన్న ఇద్దరు అమ్మాయిలు భారీ అలకు సముద్రంలోకి కొట్టుకుపోసాగారు. అలా కొంతసేపు జరిగిన తరువాత కొందరు ఎలాగో వారిని రక్షించారు. అది కూడా అలలు వారిని బీచ్‌కు తీసుకువచ్చాయి. దీంతో వారిని అక్కడే ఉన్న కొందరు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో వారు భయంతో కేకలు వేయడాన్ని కూడా చూడవచ్చు.
ఆ అమ్మాయిలకు అలా కాస్తలో ప్రాణాపాయం తప్పింది. వారి లక్ బాగుంది కాబట్టే బతికి బట్టకట్టగలిగారు.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ ఇద్దరు అమ్మాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో బీచ్ ఒడ్డున ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదా.. అని కామెంట్లు పెడుతున్నారు.