Vankaya Tomato Pachadi : వంకాయ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో సూప‌ర్‌గా ఉంటుంది..

Vankaya Tomato Pachadi : వంకాయ‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయ‌ల‌తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కేవ‌లం కూర‌లే కాకుండా వంకాయ‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తారు. వంకాయ‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వంకాయ ప‌చ్చ‌డిని క‌లిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. వంట రాని వారు కూడా చేసుకునేలా చాలా సుల‌భంగా రుచిగా వంకాయ‌ల‌తో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – 4 ( మధ్య‌స్థంగా ఉన్నవి), టమాటాలు – 3, నూనె – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 8 లేదా త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, చింత‌పండు – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vankaya Tomato Pachadi gives delicious taste with rice
Vankaya Tomato Pachadi

వంకాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను, ట‌మాటాల‌ను మంట మీద కాల్చుకోవాలి. స్ట‌వ్ మీద పుల్కా స్టాండ్‌ను ఉంచి దానిపై వంకాయ‌ల‌ను ఉంచి కాల్చుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ మెత్త‌గా ఉడికే వ‌ర‌కు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వంకాయ‌ల మాదిరిగానే ట‌మాటాల‌ను కూడా కాల్చుకుని అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత వాటిపై ఉండే తొక్క‌ను తీసేయాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.

ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, చింత‌పండు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కాల్చి పెట్టుకున్న వంకాయ‌ల‌ను, ట‌మాటాల‌ను, ఉల్లిపాయ ముక్క‌ల‌ను, ఉప్పును వేసి క‌చ్చాప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే వంకాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ ప‌చ్చ‌డిని రోట్లో వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని తాళింపు కూడా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా వంకాయ‌ల‌తో ప‌చ్చ‌డిని చేసి తిన‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts