Veg Fried Rice : వెజ్ ఫ్రైడ్ రైస్‌.. ఇలా చేస్తే అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్‌లోలా వస్తుంది..!

Veg Fried Rice : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ల‌భించే వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా దీనిని త‌యారు చేయ‌డానికి వివిధ ర‌కాల సాస్ ల‌ను, వెనిగ‌ర్ వంటి వాటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇవి ఏవి కూడా ఉప‌యోగించ‌కుండా కూడా మ‌నం వెజ్ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. సాస్ ల‌ను ఉప‌యోగించ‌కుండా రుచిగా వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొడిపొడిగా చేసుకున్న అన్నం – 5 క‌ప్పులు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 4 లేదా 5, అల్లం – రెండు ఇంచుల మొక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – పావు క‌ప్పు, త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – పావు క‌ప్పు, క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు, ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లు – పావు క‌ప్పు, స్వీట్ కార్న్ – పావు క‌ప్పు, క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – పావు క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Veg Fried Rice make in this style served food center
Veg Fried Rice

వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్ ను వేసి క‌లపాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత ఇందులో కూర‌గాయ ముక్క‌ల‌న్నింటినీ వేయాలి. త‌రువాత త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిపై మూత‌ను ఉంచి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు అన్నాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. అన్నం మిగిలిన‌ప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ ను చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేసిన ఫ్రైడ్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఒక స్పూన్ కూడా మిగ‌ల్చ‌కుండా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts