Birth At Night : రాత్రి పూట పుట్టిన వారికి చెందిన ఆసక్తిక‌ర‌మైన విష‌యాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..

Birth At Night : సాధార‌ణంగా పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల‌లో అది కూడా అరుదైన స‌మయంలో పుడితే అదృష్ట‌మ‌ని గ్ర‌హాల స్థితిగ‌తుల‌ను బ‌ట్టి వేద పండితులు అంచ‌నా వేసి చెబుతుంటారు. పిల్ల‌లు జ‌న్మించిన స‌మ‌యాన్ని బ‌ట్టి, రాశుల గ‌మ‌నాన్ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్తును అంచ‌నా వేస్తూ ఉంటారు. అందుకే త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల జాత‌కాన్ని జాగ్ర‌త్త‌గా చూపిస్తూ ఉంటారు. మ‌నుషులంద‌రిలో కొంద‌రు తెలివైన వారు ఉంటారు. కొంద‌రు త‌క్కువ‌గా ఆలోచించేవారు కూడా ఉంటారు. అదే విధంగా వీరితో పాటు తెలివి అస్స‌లు లేనివారు కూడా ఉంటారు. కొందరికి పుట్టుక‌తోనే అమిత‌మైన తెలివి తేట‌లు ఉంటాయి. కొంద‌రు పెరుగుతూ ఉంటే తెలివి తేట‌లు వ‌స్తాయి.

తెలివి తేట‌ల విష‌యంలో ఎవ‌రు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం ఇత‌ర స‌మ‌యాల్లో పుట్టిన వారి కంటే స‌హ‌జంగానే ఎక్కువ తెలివితేట‌లు క‌లిగి ఉంటార‌ట‌. ప‌లువురు పిల్ల‌ల‌పై శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. పిల్ల‌ల యొక్క పుట్టిన స‌మ‌యం, వారి చ‌దువు , జ్ఞానం వంటి అంశాలను ప‌రిశీలించారు. అలా పిల్ల‌ల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న ద్వారా వారు ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో పుట్టిన వారి కంటే రాత్రి పూట పుట్టిన వారే జ్ఞాన‌వంతులుగా ఉంటార‌ట‌. వారికే ఐక్యూ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. వీటితో పాటు ప‌లు ఇత‌ర విష‌యాల‌ను కూడా ఆ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.

people who Birth At Night must know these things
Birth At Night

రాత్రి పూట పుట్టిన వారికి తెలివితేట‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వీరు అన్ని రంగాల్లో ఎక్కువ‌గా రాణిస్తార‌ట‌. గొప్ప ఉద్యోగాల్లో ఉంటార‌ట‌. సాధార‌ణంగా ఎవ‌రికైనా రోజుకు 7 నుండి 8 గంట‌ల నిద్ర కావాలి. కానీ వీరికి 5 నుండి 6 గంట‌ల నిద్ర ఉండే స‌రిపోతుంద‌ట‌. రాత్రి పూట పుట్టిన వారికి ఎక్కువ నిద్ర అవ‌స‌రం ఉండ‌ద‌ట‌. అన్నీ ప‌నుల్లో వీరు చురుకుగా ఉంటార‌ట‌. అంతేకాదు వీరు ఎక్కువ‌గా ప‌ని కూడా చేస్తార‌ట‌. అలాగే వీరి గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని కూడా ప‌రిశోధకులు వెల్ల‌డించారు. అందేంటంటే తెలివి ఎక్కువ‌గా ఉండే వారిలో మాన‌సిక రుగ్మ‌తులు, ఆందోళ‌న, ఒత్తిడి కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

అలాగే సాధార‌ణ తెలివి ఉన్న వ్య‌క్తుల్లో కంటే ఎక్కువ తెలివితేట‌లు ఉన్న వ్య‌క్తుల్లో ఆరోగ్య స‌మ‌స్య‌లు 10 శాతం ఎక్కువ‌గా ఉంటాయని వీరి ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వీటితో పాటు 500 మంది పిల్ల‌ల మీద వీరు సుదీర్ఘ కాలం పాటు అధ్య‌య‌నం చేసారు. వీరి ఆరోగ్య ప‌రిస్థితి, ఆలోచ‌నా విధానం త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. వీరిలో 200 కంటే ఎక్కువ మంది చిన్నారులు మామూలు కంటే ఎక్కువ తెలివి తేటలు క‌లిగి ఉన్న వారు.

అంతేకాదు వీరిలో చాలా మందికి 18 నుండి 20 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే స‌రికి ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటి బారిన ప‌డ‌డ‌మే కాకుండా మ‌రికొన్ని మాన‌సిక రుగ్మ‌తల బారిన కూడా ప‌డ్డార‌ని ప‌రిశోధకులు గుర్తించారు. అయితే సాధార‌ణ తెలివి తేట‌లు ఉన్న వారిలో మాత్రం ఈ స‌మ‌స్య‌ల‌ను వారు గుర్తించ‌లేదు. వీరిలో ఎక్కువ తేలివితేట‌ల కార‌ణంగానే మాన‌సిక రుగ్మ‌తలు త‌లెత్తాయా.. అన్న విష‌యంపై ఇంకా అధ్య‌య‌నాలు నిర్వ‌హించాల్సి ఉంది.

D

Recent Posts