Silver Elephant Idol : మనిషి జీవితమంటేనే సమస్యలమయం. మన సమాజంలోని ప్రతి ఒక్కరు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. కొందరికి ఆర్థిక సమస్యలుంటే, కొందరికి ఆరోగ్య సమస్యలుంటాయి. మరికొందరికి దాంపత్య సమస్యలు ఉంటాయి. అయితే ఏ సమస్య అయినా సరే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే దాంతో ఆ సమస్యల నుంచి బయట పడవచ్చని హిందూ పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వెండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
వినాయకుడికి విఘ్నేశ్వరుడనే ఇంకో పేరు కూడా ఉంది. అంటే.. ఆయన మనకు కలిగే విఘ్నాలను తొలగిస్తాడన్నమాట. ఈ క్రమంలోనే ఆయన్ను ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అనేక విషయాల్లో మనం విజయం సాధించవచ్చు. అన్ని సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. వెండి ఏనుగు బొమ్మకు సైజుతో సంబంధం లేదు. ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా సరే.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే సమస్యలు పోతాయి.
వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయట పడవచ్చు. వెండి ఏనుగు బొమ్మను ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ఉండే అన్ని సమస్యలు పోతాయట. ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారట.