Bigg Boss OTT : అందాల ఆర‌బోత కోస‌మే.. బిగ్‌బాస్ ఓటీటీ..?

Bigg Boss OTT : ప్ర‌స్తుత త‌రుణంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎక్క‌డ చూసినా ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. క‌రోనా పుణ్యమా అని ఓటీటీల పాపులారిటీ మ‌రింత పెరిగింది. ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. దీంతో ఓటీటీ యాప్‌లు వారి కోసం అనేక ర‌కాల షోస్‌, సినిమాలు, సిరీస్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. వాటికి రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓటీటీల‌ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సిరీస్‌లు, సినిమాల్లో అస‌భ్య‌త కూడా ఉంటోంది. హీరోయిన్ల అందాల ఆర‌బోతే ల‌క్ష్యంగా వాటిని తెర‌కెక్కిస్తున్నారు. అయితే మొన్నీ మ‌ధ్య వ‌ర‌కు బిగ్ బాస్ అంటే కేవ‌లం టీవీకి మాత్ర‌మే ప‌రిమితం అయింది. కానీ బిగ్‌బాస్ ఓటీటీ పేరిట కేవ‌లం ఓటీటీ కోస‌మే రియాలిటీ షోల‌ను నిర్వ‌హిస్తున్నారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ని అంటున్నారు.

what is the purpose of Bigg Boss OTT
Bigg Boss OTT

టీవీల‌కు అయితే సిరీస్‌, సినిమా, షో.. ఏదైనా స‌రే ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా చూస్తారు క‌నుక‌.. అశ్లీల‌త‌కు పెద్ద‌గా తావు ఉండ‌దు. కానీ ఓటీటీ అలా కాదు. స్మార్ట్ టీవీలు ఉన్నా స‌రే ఎక్కువ శాతం ప్రేక్ష‌కులు ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూట‌ర్ల‌లో చూస్తారు. క‌నుక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వ‌చ్చే సిరీస్‌లు, సినిమాల్లో మ‌సాలాను జోడించ‌వ‌చ్చు. అందుక‌నే ఈ మ‌ధ్య ఓటీటీల్లో అలాంటి మసాలా సీన్లు ఉండే సిరీస్‌లు, సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ద‌క్షిణాదిలో గ‌త 2 ఏళ్ల వ‌ర‌కు ఈ విధానం లేదు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాకు చెందిన ఓటీటీల్లోనూ అశ్లీల‌త‌కు పెద్ద పీట వేస్తున్నారు. క‌నుకనే పెద్ద‌ల‌కు మాత్ర‌మే సిరీస్‌లు, సినిమాల‌ను ఎక్కువ‌గా తీస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఓటీటీకి కూడా ఇది వ్యాపించింది.

టీవీల్లో వచ్చే ఏ షో అయినా.. మూవీ అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ‌గా చూస్తారు క‌నుక అందులో మ‌సాలా సీన్ల‌ను జోడించ‌లేరు. కానీ ఓటీటీల్లో అవి పెట్ట‌వ‌చ్చు. క‌నుకనే బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌న ద‌గ్గ‌ర ఈ షో ఇప్పుడు ప్రారంభం అయింది.. కానీ హిందీలో ఇప్ప‌టికే బిగ్ బాస్ ఓటీటీని ప్ర‌సారం చేశారు. అందులో కొంద‌రు సెల‌బ్రిటీలు అందాల‌ను ఆర‌బోశారు. ఇక తాజాగా ప్రారంభం అయిన తెలుగు బిగ్ బాస్ ఓటీటీలోనూ అలా గ్లామ‌ర్ ను ఒల‌క‌బోసే కొంద‌రిని తీసుకున్నారు. దీన్ని బ‌ట్టే షో ఎలా ఉండ‌బోతుంది ? అన్న విష‌యంపై ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అందుక‌నే తాజాగా సీపీఐ నారాయ‌ణ లాంటి వారు ఆ షోను ఏకంగా బ్రోత‌ల్ హౌస్‌తో పోల్చారు. మ‌రి ఆయ‌న అన్న‌ట్లుగానే షోలో ముందు ముందు అలాంటి గ్లామ‌ర్ షో చేస్తారా ? షోను అందుకోస‌మే ప్రారంభించార‌నే మ‌చ్చ తెచ్చుకుంటారా ? లేక ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూసేలా షో నిర్వ‌హిస్తారా ? అన్న విష‌యాలు త్వ‌ర‌లో తేల‌నున్నాయి.

Editor

Recent Posts