ఆధ్యాత్మికం

Tulsi Plant : ఎండిపోయిన తుల‌సి మొక్క‌ను ఏం చేయాలి..? ఈ పొర‌పాట్లు మాత్రం చేయ‌కండి..!

Tulsi Plant : హిందువులు తుల‌సి మొక్క‌ను ఎంతో ప‌విత్రంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో తుల‌సి ఉందంటే ల‌క్ష్మీదేవి ఉన్న‌ట్టే భావిస్తారు. ఇంట్లో తుల‌సి మొక్క‌ను ఏర్పాటు చేసుకుని ప్ర‌తిరోజూ పూజిస్తూ ఉంటారు కూడా. తుల‌సి మొక్క పాజిటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి వ‌చ్చేలా చేస్తుంది. క‌నుక తుల‌సి మొక్క ఎల్ల‌ప్పుడూ ప‌చ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల తుల‌సి మొక్క ఎండిపోతుంది. అటువంటి స‌మ‌యంలో తుల‌సి మొక్క‌ను తొల‌గించేట‌ప్పుడు కొన్ని విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మీరు అనుస‌రించే ప‌ద్ద‌తులు మీకు ఇబ్బందులు క‌లిగించే అవ‌కాశం ఉంది. తుల‌సి మొక్క ఎండిన త‌రువాత ఏం చేయాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండిపోయిన తుల‌సి మొక్క‌ను ఇంట్లో ఉంచ‌కూడ‌దు. హిందు మ‌తం ప్ర‌కారం ఇంట్లో తుల‌సి మొక్క‌ను నాట‌డం చాలా శుభ‌ప్ర‌దంగా భావిస్తారో తుల‌సి మొక్క ఎండిపోవ‌డాన్ని కూడా అంతే అశుభంగా భావిస్తారు. అలాంటి మొక్క ఇంట్లో ఎప్పుడూ ఉంచ‌కూడ‌దు. వెంట‌నే తొల‌గించాలి. లేదంటే ఇంట్లోకి ప్ర‌తికూల శ‌క్తి ప్ర‌వేశిస్తుంద‌ని న‌మ్ముతారు. ఎండిపోయిన తుల‌సి మొక్క స్థానంలో ప‌చ్చ‌గా ఉండే మ‌రో మొక్క‌ను నాటాలి. ఎండిన తుల‌సి మొక్క‌ను కాల్చ‌కూడ‌దు. అలాగే దాన్ని విసిరివేయ‌కూడ‌దు. అలా చేయ‌డం అశుభం. ఎండిన తుల‌సి మొక్క‌ను భూమిలో పాతిపెట్ట‌డం మంచిది. అలాగే ఇంట్లో తుల‌సి మొక్క‌ను నాటేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. రాత్రిపూట తుల‌సి ఆకులు కోయ‌కూడ‌దు. అలాగే ఆదివారం, ఏకాద‌శి తిథిలో కూడా తుల‌సి ఆకులు కోయ‌కూడదు. తుల‌సి ఆకులు తొక్క‌కూడ‌దు. తుల‌సిని ల‌క్ష్మీ దేవిలాగా భావిస్తారు. క‌నుక నేల‌పై ప‌డిన తుల‌సి ఆకుల‌ను మ‌ట్టిలో పాతిపెట్టాలి.

what to do with dried tulsi plant

వాటిని తొక్క‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం కోల్పోవాల్సి వ‌స్తుంది. తుల‌సి కోట‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తుల‌సి మొక్క ప‌విత్ర‌మైన‌ది క‌నుక దీనిని కుండీలో ఎత్తుగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. ప్ర‌తిరోజూ పూజ‌లు చేస్తూ దీపం వెలిగించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ మీపై ఉంటాయి. తుల‌సి మొక్క‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా పూజించ‌డం వ‌ల్ల కుటుంబంలో అంద‌రూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇంట్లో శాంతి నెల‌కొంటుంది.

Admin

Recent Posts