వినోదం

Balakrishna Daughters : బాలయ్య తన కూతుళ్ల‌ని హీరోయిన్లుగా ఎందుకు రానివ్వ‌లేదు..?

Balakrishna Daughters : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. నరసింహంగా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే. కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయిన‌ వసుంధరను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవరూ ఆడపిల్లలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య తన కూతుళ్ల‌ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తోంది. అయితే బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని, కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నారా బ్రాహ్మిణికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని, ఆమె ఫోకస్ అంతా బిజినెస్ వైపే ఉందని తెలుస్తోంది.

why balakrishna daughters not entered into film industry

అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట. తన పాత్ర తెర వెనుక ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటోందట. ఈ క్రమంలోనే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీలో తెరపై కనిపించడం లేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది. అయితే నంద‌మూరి త‌రం వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ అస‌లు విష‌యం చెప్ప‌డం లేదు. మ‌రి ఈ విష‌యంలోనైనా క్లారిటీ వ‌స్తుందా.. అనేది చూడాలి.

Admin

Recent Posts