ఆధ్యాత్మికం

Salt And Lakshmi Devi :ఉప్పును మ‌హాల‌క్ష్మితో పోల్చుతారు.. ఉప్పుకు, సంప‌ద‌కు సంబంధం ఏమిటి..?

Salt And Lakshmi Devi :ఉప్పుని తొక్కకూడదు. ఉప్పుని మహాలక్ష్మి అని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది, సముద్రంలో ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పుని తొక్క కూడదని అంటారు. ఉప్పుని మన చేతితో ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వడం కూడా మంచిది కాదు. అయితే చాలా మంది డబ్బులని బాగా సంపాదిస్తున్నాం.. కానీ మా చేతుల్లో అవి ఉండడం లేదు. జీతాలు రాగానే బాగా ఖర్చయిపోతున్నాయి అంటూ ఉంటారు.

డబ్బులు బాగా ఖర్చు అయిపోయి బాధ పడే వాళ్ళు, జీతాలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు అన్నింటినీ ఒక కాగితంలో చుట్టి ఒకరోజు రాత్రంతా కూడా ఆ డబ్బుని, ఉప్పు డబ్బాలో ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఖర్చు పెట్టండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బులు అనవసరంగా వృథా అయిపోవు. రాత్రిపూట ఉప్పు అని అనకూడదు. లవణం అని అనాలి.

why lakshmi devi is compared with salt

శుక్రవారం నాడు పొద్దున్నే గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పు వేసి, ఈశాన్యం మూలన పెడితే ఆర్థిక కష్టాల నుండి బయటపడొచ్చు. అదే విధంగా సిరిసంపదలు కలగాలంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంటికి వచ్చినటు వంటి ముత్తైదువులని చాప వేసి కూర్చోబెట్టి, మంచినీళ్లు ఇచ్చి, పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇవ్వాలి.

ఈ విధంగా మీరు పాటిస్తే సిరిసంపదలు కలుగుతాయి. సౌభాగ్యం మెండుగా ఉంటాయి. మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే, ఎర్రటి గుడ్డలో ఉప్పు వేసి ఇంటి గుమ్మం ముందు కట్టాలి. మరుసటి రోజు ఉదయం గుడ్డలో కట్టినటు వంటి ఉప్పు ఎవరు తొక్కని చోట వేసేయాలి. అలా చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉప్పుని అసలు అరువు ఇవ్వకూడదు. అరువుతెచ్చుకోకూడదు. వీటిని కచ్చితంగా పాటిస్తే, ధన లక్ష్మి మీ ఇంట ఉంటుంది. సిరిసంపదలు కలుగుతాయి.

Admin

Recent Posts