సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లయిన మహిళలు మంగళసూత్రం ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పెళ్లి తర్వాత స్త్రీ మెడలో మంగళసూత్రం పడితే తన భర్త మరణించే వరకు మంగళసూత్రం తన మెడలో ఉంటుంది. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం వస్తుంది. మంగళ సూత్రాన్ని భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు.
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళ సూత్రానికి కొంతమంది మహిళలు పిన్ను సూదులను వేస్తుంటారు. ఈ విధంగా మంగళసూత్రానికి ఇనుప పిన్నీసులు వేయటం వల్ల అవి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మంగళసూత్రంపై ఉండటంవల్ల భర్తపై కూడా నెగిటివ్ ప్రభావం ఏర్పడి బలహీనుడు అవుతాడు. అదేవిధంగా భర్త ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతాడు.
ఇలా నెగిటివ్ ప్రభావం భార్యాభర్తలపై పడినప్పుడు వారి మధ్య అన్యోన్యత తగ్గి క్రమంగా గొడవలు జరగడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, అదేవిధంగా మృత్యుభయం వెంటాడటం వంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైతే మంగళ సూత్రానికి ఈ విధమైన ఇనుప పిన్నీసులను తొలగిస్తారో అప్పుడే వారికి ఎలాంటి కష్టాలు ఉండవని పండితులు చెబుతున్నారు. అందుకే మంగళ ప్రదమైన మంగళసూత్రానికి ఇనుప వస్తువులను వేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.