Heart Attack : మీరు గమనించారో లేదో చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తుంది. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం అవుతుంది. అవసరానికి సరిపడ ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ రాత్రి 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి.
రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోండి. రోజూ ఐదు రకాల పండ్లు తినండి. ఆల్కహాల్, పొగతాగే అలవాటు ఉంటే మానేయండి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి (ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కనుక వీరు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.
హార్ట్ ఎటాక్ కు ముందు మనకు కన్పించే లక్షణాలు..
జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా, అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి. దీంతోపాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి. ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు. వైద్యున్ని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.
విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా పనిచేస్తాయి. మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కంటి చివర్లలో కురుపుల వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు. ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణమవకపోతున్నా, గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలుగానే భావించాలి.
శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి. ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు. కాళ్లు, పాదాలు, మడమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాలి. గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా అసాధారణ రీతిలో ఉంటుంది. కాబట్టి హార్ట్ బీట్‌ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఈవిధంగా పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.