Pomegranate : దానిమ్మని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ పండ్లు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా రకాల ఉపయోగాలు దానిమ్మ పండు ద్వారా పొందొచ్చు. అయితే, దానిమ్మ వలన ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. కానీ, దానిమ్మ వలన కొన్ని సమస్యలు వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని సమయాల్లో, మనకి దానిమ్మ సమస్యల్ని కలిగిస్తుంది. దానిమ్మ పండు ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, అల్సర్ల సమస్య ఉన్నట్లయితే, త్వరగా నయం అయిపోతుంది.
నడుము నొప్పితో బాధపడే వాళ్ళు, దానిమ్మ రసం ని తాగడం వలన, నడుము నొప్పి తగ్గుతుంది. దానిమ్మ జ్యూస్ లో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటే, వెంటనే ఉపశమనం లభిస్తుంది. చాలామంది డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు, ఎక్కువగా దానిమ్మ పండు జ్యూస్ లేదంటే పండు తీసుకున్నా డిప్రెషన్ నుండి, చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు దానిమ్మ పండ్లు తీసుకోవడం వలన, బ్లడ్ త్వరగా పెరుగుతుంది.
దగ్గు సమస్య ఉన్నట్లయితే, దానిమ్మ పండ్లకు దూరంగా ఉండాలి. దగ్గుతో బాధపడే వాళ్ళు దానిమ్మను అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే, దగ్గు, ఆస్తమా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే అవి ఇంకా రెట్టింపు అవుతాయి. ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్లు కూడా తీసుకోకూడదు.
బీపీ బాధ ఉంటే కూడా తీసుకోవద్దు. ఇలా ఈ సమస్యలు ఉన్నవాళ్లు దానిమ్మ పండ్లకు దూరంగా ఉండాలి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇది ఇలా ఉంటే, దానిమ్మ తొక్కలు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తొక్కల్ని ఎండపెట్టి పొడి కింద చేసుకుని, ఫేస్ ప్యాక్ లా వేసుకుంటూ ఉంటారు. దీంతో చర్మం పై గ్లో పెరుగుతుంది. అలానే, దానిమ్మ తొక్కలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.