Bananas : అర‌టి పండ్లు పాడ‌వ‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌క ధ‌ర క‌లిగిన పండ్లలో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి కూడా ఈ పండ్లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తుంటాయి. ఇక అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో కూడా అంద‌రికీ తెలుసు. అయితే అర‌టి పండ్లు సాధార‌ణంగా మ‌నం కొన్న‌ప్పుడు ప‌సుపు రంగులో ఉంటాయి. కానీ కేవ‌లం 1-2 రోజుల్లోనే అవి బాగా పండి మురిగిపోతాయి. న‌ల్ల‌ని మ‌చ్చ‌లు బాగా ఏర్ప‌డుతాయి.

అయితే నల్ల‌ని మ‌చ్చ‌లు ఉండే పండ్లు మంచివే అయిన‌ప్ప‌టికీ ఇవి ఎక్కువ రోజుల పాటు ఉండ‌వు. త్వ‌ర‌గా పాడ‌వుతాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ పండ్ల‌ను ఎప్పుడైనా స‌రే పాడ‌వ‌కుండా తాజాగా తిన‌వ‌చ్చు. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటిస్తే అర‌టి పండ్ల‌ను ఎల్లప్పుడూ పాడ‌వ‌కుండా తాజాగా ఉంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these tips to keep Bananas fresh for long time
Bananas

అర‌టి పండ్ల‌ను ఒక పాలిథీన్ లేదా ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో పెట్టి మూతలా చుట్టాలి. త‌రువాత ఆ క‌వ‌ర్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో అరటి పండ్లు త్వ‌ర‌గా పాడ‌వ‌వు. ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. అలాగే అర‌టి పండ్ల‌ను ఇత‌ర పండ్లు లేదా కూర‌గాయ‌ల‌తో క‌లిపి ఉంచ‌రాదు. ఉంచితే త్వ‌ర‌గా పాడ‌వుతాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను ప్ర‌త్యేకంగా ఇంకో చోట పెట్టాలి. అలాగే అర‌టి పండ్ల‌ను ఓపెన్‌గా గాలి త‌గిలేలా ఉంచ‌రాదు. ఉంచితే పాడ‌వుతాయి. క‌నుక మూత ఉంచాలి. లేదా ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో చుట్టి పెట్టాలి.

ఇక అర‌టి పండ్లు పాడ‌వ‌కుండా ఉండాలంటే వాటిని నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంచాలి. ఎందుకంటే వాటిల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ పండ్లు త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా చేస్తుంది. అలాగే అర‌టి పండ్ల‌ను డీప్ ఫ్రిజ్‌లో కూడా పెట్ట‌వ‌చ్చు. దీంతో అవి గ‌డ్డ క‌డ‌తాయి. ఫ‌లితంగా అవి త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా ఎప్ప‌టికీ అలాగే ఉంటాయి. త‌రువాత వాటిని బ‌య‌ట‌కు తీసి మంచు మొత్తం క‌రిగిన త‌రువాత తిన‌వ‌చ్చు. ఇలా అర‌టి పండ్ల‌ను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవ‌చ్చు.

Editor

Recent Posts