Categories: పండ్లు

నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

మనకు సీజనల్‌గా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ వీటితో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of jambul fruit

1. నేరేడు పండ్లలో కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

2. నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం అనే చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది.

3. మూత్ర సమస్యలను పరిష్కరించడంలోనూ నేరేడు పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. మూత్ర సాఫీగా రానివారు ఈ పండ్లను తింటే మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలు శుభ్రమవుతాయి. కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. మూత్రాశాయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

4. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలు దృఢంగా మారుతాయి, చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన పోతుంది.

5. నేరేడు పండ్లను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చురుగ్గా ఉంటారు. మతిమరుపు సమస్య తగ్గుతుంది.

6. నేరేడు పండ్లలో ఉండే విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిల్లోని కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది.

7. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు నేరేడు పండ్లను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

8. ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పండ్లను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్‌ తగ్గుతాయి. ఈ పండ్లలో ఉండే పోషకాలు లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. లివర్‌ను శుభ్రంగా మారుస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts