Watermelons : పుచ్చ‌కాయ‌ల‌తో క‌లిపి వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోరాదు.. ఎందుకంటే..?

Watermelons : పుచ్చకాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మ‌న‌లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఱ‌ఖ్యంగా వేస‌వికాలంలో వీటిని మ‌రింత ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం, ఐర‌న్, ఫాస్ప‌ర‌స్, పోలేట్, క్యాల్షియం వంటి పోష‌కాలు ఉంటాయి. వేస‌వికాలంలో వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన పోష‌కాలు తిరిగి శ‌రీరానికి అందుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా పుచ్చకాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

అయితే పుచ్చకాయ‌ను తీసుకున్న త‌రువాత కొన్ని ఆహారాల‌ను తీసుకోకూడ‌దని నిపుణులు చెబుతున్నారు. పుచ్చ‌కాయ‌తో పాటు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పుచ్చ‌కాయ‌తో పాటు తీసుకోకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్ర‌కారం పుచ్చ‌కాయ‌ను పాల‌తో క‌లిపి తీసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. పాల‌ల్లో విట‌మిన్ డి తో పాటు ప్రోటీన్స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పాల‌ను ఆమ్ల‌త‌త్వం ఉన్న పుచ్చకాయ‌తో క‌లిపి తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. పాల‌ను, పుచ్చ‌కాయ‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల నీళ్ల విరోచ‌నాలు, గ్యాస్, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక పాల‌ను, పుచ్చ‌కాయ‌ను క‌లిపి తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

never combine these foods with Watermelons
Watermelons

అలాగే పుచ్చకాయ తిన్న త‌రువాత ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. పుచ్చకాయ‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు స్టార్చ్ కూడా ఉంటుంది. పుచ్చ‌కాయ‌ను తిన్న త‌రువాత శ‌న‌గ‌లు, బీన్స్, ప‌న్నీర్ వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక పుచ్చకాయ‌ను తిన్న గంట త‌రువాత వీటిని తీసుకోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే కోడిగుడ్ల‌ను, పుచ్చ‌కాయ‌ను క‌లిపి తీసుకోకూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లల్లో ఫైబ‌ర్ తో పాటు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. పుచ్చ‌కాయ‌లో నీళ్లు ఎక్కువ‌గా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ను తిన్న త‌రువాత కోడిగుడ్ల‌ను తిన‌డం వల్ల అవి స‌రిగ్గా జీర్ణం కావు. దీంతో క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

క‌నుక పుచ్చ‌కాయ‌ను, కోడిగుడ్డును క‌లిపి తీసుకోకూడ‌దు. అదే విధంగా పుచ్చకాయ‌ను తిన్న త‌రువాత నీటిని తాగ‌కూడ‌దు. పుచ్చ‌కాయ‌లో ఉండే చ‌క్కెర‌లు ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో క‌డుపులో అసౌక‌ర్యంతో పాటు వివిధ ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల బారిన ప‌డవ‌చ్చు. క‌నుక పుచ్చ‌కాయ‌ను తిన్న వెంట‌నే నీటిని తాగ‌కూడ‌దు. ఈ సూచ‌న‌ల‌ను గుర్తు పెట్టుకుని దానికి అనుగుణంగా డైట్ లో పుచ్చ‌కాయ‌ను చేర్చుకోవాలని, ఈ సూచ‌న‌లు పాటిస్తూ పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts