Protein Fruits : ఈ 7 పండ్ల‌ను త‌ర‌చూ తింటే చాలు.. కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్లు ల‌భిస్తాయి..!

Protein Fruits : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కండ‌రాలు అభివృద్ది చెందేలా చేయ‌డంలో, శ‌రీరంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొదించ‌డంలో, హార్మోన్ల‌ను స‌మ‌తుల్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌సులో ఉన్న వారికి, గ‌ర్భిణీ స్త్రీల‌కు ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. వీరు త‌ప్ప‌కుండా ప్రతిరోజూ త‌మ ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ‌గా జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది. అయితే వీటిని ప్ర‌తిరోజూ అంద‌రూ తీసుకోలేరు. జంతు సంబ‌ధిత ఆహారాల‌ను తీసుకోలేని వారు కొన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినంత ప్రోటీన్ ల‌భిస్తుంది. చాలా మంది పండ్ల‌ల్లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ మాత్ర‌మే ఉంటాయి అనుకుంటారు. కానీ పండ్ల‌ల్లో ప్రోటీన్ కూడా ఉంటుంది.

ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే పండ్లల్లో జామ‌కాయ కూడా ఒక‌టి. ఒక క‌ప్పు జామ‌కాయ ముక్క‌ల‌ల్లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తో పాటు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్, విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గా ఉంటుంది. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్ ల‌తో పాటు ఈ ఇత‌ర పోష‌కాలు కూడా మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. అదే విధంగా అవ‌కాడో కూడా ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఒక్కో అవ‌కాడోలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనితో పాటు ఫైబ‌ర్, పొటాషియం, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ బి6 వంటి పోష‌కాలు కూడా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా ఒక క‌ప్పు బ్లాక్ బెర్రీల‌లో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఫైబ‌ర్, విట‌మిన్ సి వంటి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

Protein Fruits take them regularly for better health
Protein Fruits

అలాగే ఒక్కో కివీ పండులో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే విట‌మిన్ సి, కె, పొటాషియం వంటి పోష‌కాలు కూడా ఉంటాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి ఇవి చ‌క్క‌టి ఆహారమ‌ని చెప్ప‌వ‌చ్చు. అదే విధంగా పీచ్ ఫ్రూట్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఒక క‌ప్పు ముక్క‌ల‌ల్లో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అదే విధంగా ప‌న‌స కాయ‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల ప‌న‌స తొన‌ల‌ల్లో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి క‌డా మేలు క‌లుగుతుంది. ఈ విధంగా పండ్ల‌ల్లో కూడా ప్రోటీన్ ఉంటుంద‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts